మెదక్

సమస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కే యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 20: ఉమ్మడి మెదక్ జి ల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించి పరిష్కారం చూపేందుకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నట్లు కనిపించడం లేదని, గత ప్రభుత్వాలను విమర్శించడానికే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని పటాన్‌చెరు జెడ్పీటీసి శ్రీకాంత్‌గౌడ్ విమర్శించారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడి న తీరు ఇబ్బంది కలిగించిందన్నారు. శనివారం సం గారెడ్డిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చెప్పమం టే 60యేళ్లలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మూ డేళ్లలో అంతా తామే చేశామంటూ విమర్శిస్తూ డిప్యూటీ స్పీకర్ మాట్లాడటం సరికాదన్నారు. జిల్లా పరిషత్తులకు నిధులు కేటాయించడంలో ఈ ప్రభుత్వం వివక్ష చూపుతుందని, నిధులు తీసుకురాలేని మీరు గత ప్రభుత్వాల గురించి మాట్లాడటం సి గ్గుచేటన్నారు. నిధులు లేక, ప్రజల అవసరాలు తిర్చలేక జెడ్పిటీసిలు మొకం చాటుకోవాల్సిని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలకే ప్రధాన అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఇ బ్బందికర వాఖ్యలు చేసిన స్పందించకుండా జిల్లా పరిషత్ గౌరవం కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎలాంటి జివో లేకుండానే సీంగూర్ ప్రాజెక్టు నీటిని ఇతర ప్రాంతానికి తరలించామని జెడ్పీ సాక్షిగా డి ప్యూటి స్పీకర్ ఒప్పుకుందన్నారు. తెరాస సభ్యులే పథకాల లోపాలు, నిర్వహణ, అవినీతిపై మాట్లాడిన తీరు చూస్తుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎం జరుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఒక అధికారి మహిళా జెడ్పీటీసిని అవమానించిన ఏలాంటి చర్య లు తీసుకోలేదన్నారు. ఇతర ప్రభుత్వాలను విమర్శించే ముందు నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితి, అభివృద్ధిపై ఆలోచిస్తే బాగుటుందని హిత వుపలికా రు. సమావేశంలో కిషోర్‌రెడ్డి, షఖీల్, ధన్‌రాజ్, దుర్గసాయి, శివప్రసాద్‌రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ సర్కార్
గజ్వేల్, జనవరి 20: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్ సర్కార్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం వర్గల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా యువకులు, కార్మికులు, పేదలు, రైతులు, మహిళలకు ఎన్నో ఆశలు చూపిన సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం ముండి చేయి చూపినట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సీఎం కేసీఆర్‌కు పుట్టగతులుండవని, ఒకరిద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ ఎలా తెచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడి ప్రజల ఆకాంక్ష, అభీష్టాన్ని గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటింపజేయగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో సృష్టించిన గందరగోళం, చేసిన గొడవను ఇక్కడి ప్రజలు ఎన్నడూ మరిచిపోరని తెలిపారు. ఫీజు రియబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను బర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు
ప్రత్యక్ష పద్ధతిలోనే జరపాలి: టీడీపీ
సంగారెడ్డి టౌన్, జనవరి 20: గ్రామపంచాయతీ ఎన్నికలను పరోక్షంగా కా కుండా ప్రత్యేక్ష పద్దతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముందు ఒక్క రోజు దీక్షను చేపట్టి నిరసన తెలిపారు. దీక్షకు జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్‌గౌడ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్, మైనార్టీ రాష్ట్ర నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌గౌడ్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పంచాయతీలను నిర్విర్యం చేస్తుందని విమర్శించారు. గ్రామాల్లో ఉనికిని కోల్పోయమన్న భయంతోనే ఈ పరోక్ష ఎన్నికల నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. పంచాయతీలకు, జిల్లా పరిషత్‌కు నిధులు ఇవ్వకుండ బష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పరోక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచులు వార్డుమెంబర్ల వెనకే తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీక్షలో తెలుగు యువత నాయకులు ఇంతియాజ్ పాల్గొన్నారు.