జాతీయ వార్తలు

డార్విన్ సిద్ధాంతం శుద్ధ తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔరంగాబాద్, జనవరి 20: డార్విన్ సిద్ధాంతం శుద్ధ తప్పని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ తేల్చిచెప్పారు. డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతాన్ని పాఠ్యాంశంగా బోధించవద్దని విజ్ఞప్తి చేశారు. పరిణామ క్రమంలో కోతి నుంచి మానవుడు ఉద్భవించాడని డార్విన్ సిద్ధాంతం చెబుతోంది. అయితే ఇదంతా వట్టిదని శాస్ర్తియంగా కూడా అదెక్కడా నిరూపణ కాలేదని మానవ వనరులు అభివృద్ధిశాఖ సహాయ మంత్రి తెలిపారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకొచ్చిన సత్యపాల్ సింగ్ శుక్రవారం నాడొక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ భూమిపై మానవుడు మానవునిగానే ఉద్భవించాడు తప్ప కోతి నుంచి మానవుడిగా మారలేదని అన్నారు. ‘మా పూర్వికులు గానీ తల్లిదండ్రులు గానీ కోతి నుంచి మానవుడు రూపాంతరం చెందాడని ఎక్కడా చెప్పలేదు. అలాగని ఎక్కడా రాసి లేదు’ అని మంత్రి తెలిపారు. కాబట్టి పాఠశాలలు, కళాశాల్లో డార్విన్ పాఠ్యాంశం బోధించవద్దని ఆల్ ఇండియా వేదిక్ సమ్మేళన్‌లో ఆయన పేర్కొన్నారు.