జాతీయ వార్తలు

బలం నిరూపించుకున్న అరుణాచల్‌ప్రదేశ్ సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి కలిఖో పుల్ గురువారం శాసనసభలో తనకు ఉన్న బలాన్ని నిరూపించుకున్నారు. 40 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చారు. ఇందులో 27 మంది కాంగ్రెస్ పార్టీకి, 11 మంది బిజెపికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు స్వతంత్రులు. మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీ శిబిరంనుంచి బుధవారం కలిఖో శిబిరంలోకి చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిఖోకు ఓటు వేశారు. స్పీకర్ తన ఓటుహక్కును వినియోగించుకోలేదు. నబమ్ టుకీ మద్దతుదారులుగా ఉన్న 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కలిఖో బలపరీక్ష కోసం నిర్వహించే ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనకూడదని సిఎల్‌పి చీఫ్ విప్ (టుకీ గ్రూప్) రాజేశ్ టాకో బుధవారం గట్టిగా ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే బలపరీక్షలో పాల్గొని ముఖ్యమంత్రి కలిఖోకు మద్దతుగా ఓటు వేయాలని సిఎల్‌పి చీఫ్ విప్ (కలిఖో గ్రూప్) పెమా ఖందు పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను ఎత్తివేయగానే కలిఖో పుల్ ఈ నెల 19న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వాంగ్‌కి లోవాంగ్ కొత్త స్పీకర్‌గా ఎన్నికయిన వెంటనే కలిఖో పుల్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కలిఖో మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కావడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ లభించలేదని తెలిపారు. ‘సభలో నాయకత్వాన్ని మార్చుమని మాత్రమే మేము కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరాము. అంతకు మించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు.. బిజెపి, ఇద్దరు స్వతంత్రులు బయటినుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంగానే మా ప్రభుత్వం ఉంటుంది’ అని ఆయన వివరించారు.