క్రీడాభూమి
ఇండియన్ ఓపెన్ బాక్సింగ్‌కు సర్వం సిద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 January 2018
న్యూఢిల్లీ, జనవరి 27: మొట్టమొదటి ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో 143 (42 మంది భారతీయులు), మహిళల విభాగంలో 80 (32 మంది భారతీయులు) మంది తలపడతారు. క్యూబా, కజకిస్థాన్సహా మొత్తం 21 దేశాల బాక్సర్లు పోటీపడే ఈ టోర్నమెంట్ విశేష ఆదరణ ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో బాక్సింగ్ పట్ల యువత మక్కువ చూపుతున్నదని అంటున్నారు. భారత్ ఓపెన్ ఈ దిశగా ఒక ముందడుగని చెప్తున్నారు.