జాతీయ వార్తలు

రద్దయన సీడబ్ల్యూసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఏఐసీసీలో అత్యున్నత నిర్ణాయిక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేశారు. దాని స్థానంలో 34మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని నియమించారు. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలను ఈ కమిటీ సారధ్యంలో నిర్వహించనున్నారు. పార్లమెంటులో బడ్జెట్‌పై మలి విడత చర్చ మొదలయ్యేలోగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారని భావిస్తున్నారు. కాగా ప్లీనరీని ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని నిర్ణయించేందుకు శనివారం సాయంత్రం 4 గంటలకు స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. ప్లీనరీ సమావేశాలు పూర్తయ్యాక కొత్త సీడబ్ల్యూసీని ప్రకటిస్తారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలో కొనసాగుతారు. అయితే సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుల్లో అమరీందర్ సింగ్, విలాస్ ముత్తెంవార్, ఆర్‌కే ధావన్, శివాజీరావ్ దేశ్‌ముఖ్, ఎంవీ రాజశేఖరన్, మొహిసినా కిద్వాయ్‌లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులలో ఎవ్వరికీ ఈ కమిటీలో చోటు కల్పించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఎన్నిక సహా పార్టీ సంస్థాగత ఎన్నికల ముగింపుపై స్టీరింగ్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలో 25మంది సభ్యులుంటారు. అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌తోపాటు 12మంది ఎన్నికైన ప్రతినిధులు, 11 మంది నామినేటెడ్ సభ్యులు ఇందులో ఉంటారు. కొత్తగా ఏర్పాటు చేసే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులను ప్లీనరీ సమావేశాల్లోగానీ, ఆ తరువాతగానీ ఎన్నుకుంటామని, అంతవరకు స్టీరింగ్ కమిటీ ప్లీనరీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ స్టీరింగ్ కమిటీ..
కొత్తగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, గులాంనబీ అజాద్, అంబికాసోని, జనార్దన్ ద్వివేది, అశోక్‌గెహ్లాట్, సుశీల్‌కుమార్‌షిండే, పి.చిదంబరం, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఆనంద్‌శర్మ, సీపీ జోషి, దిగ్విజయ్‌సింగ్, బీకే హరిప్రసాద్, కమల్‌నాథ్, మల్లికార్జున్ ఖర్గే, మోతీలాల్ ఓరా, హెమోప్రోవ సైకియా, రణదీప్ సుర్జీవాలా సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్న పీఎల్ పునియా, ఆర్‌పీఎన్ సింగ్, దీపక్ బబారియా, ఆర్‌సీ కుంతియా, కేసీ వేణుగోపాల్, అవినాష్ పాండే కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.