జాతీయ వార్తలు

ఇపిఎఫ్ వడ్డీపైనే పన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రాయల్స్‌పై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం మంగళవారం నివృత్తి చేస్తూ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) విత్‌డ్రాయల్స్‌పై ఇకపై కూడా పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఉద్యోగి భవిష్య నిధి (ఇపిఎఫ్)ఖాతాలో జమయ్యే మొత్తంపై వచ్చే వడ్డీలో అరవై శాతానికి మాత్రమే పన్ను విధించడం జరుగుతుందని తెలియజేసింది. ‘2016 ఏప్రిల్ 1కి ముందు ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే అన్ని చెల్లింపులు, వడ్డీపై ఎలాంటి పన్నూ ఉండదు. 2016 ఏప్రిల్ 1 తర్వాత జమఅయ్యే కంట్రిబ్యూషన్లపై మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది’ అని రెవిన్యూ శాఖ కార్యదర్శి హసన్ముఖ్ అధియా మంగళవారం పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. పిపిఎఫ్‌కు సంబంధించి ట్రిపుల్ ఇ (చెల్లింపుల సమయంలో పన్ను మినహాయింపు, రాబడిపై పన్ను మినహాయింపు, విత్‌డ్రాయల్స్‌పై పన్ను మినహాయింపు) పథకం ఇకపై కూడా కొనసాగుతుంది’ అని ఆయన చెప్పారు. పిపిఎఫ్ విషయంలో 40 శాతం పరిమితి లేదని, పూర్తిగా వందశాతం మినహాయింపే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇపిఎఫ్‌లోని 3.7 కోట్ల మంది యాక్టివ్ కంట్రిబ్యూటర్లలో కేవలం 75 లక్షల మంది అధిక వేతనం పొందే కార్పొరేట్ ఉద్యోగులపై మాత్రమే ప్రతిపాదిత విత్‌డ్రాయల్స్‌పై ఇపిఎఫ్ పన్ను విధింపు ప్రభావం ఉంటుందని అధియా చెప్పారు. 15 వేలకన్నా తక్కువ నెల జీతం ఉండే వారు 3 కోట్ల మంది ఉన్నారని, వారిని అర్హులైన సభ్యులుగా వ్యవహరిస్తారని అంటూ, ఈ 3కోట్ల మందిపై పన్ను విధింపు స్థితిలో ఎలాంటి మార్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. వీరు రిటైరయినప్పుడు ఎలాంటి పన్నులూ లేకుండా తమ మొత్తం కార్పస్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో ఈ తేడాను స్పష్టంగా వివరించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే విత్‌డ్రా చేసిన మొత్తాన్ని యాన్యుటీ పెన్షన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. దీని ఉద్దేశం రాబడిని సమకూర్చుకోవడం కాదని, ఒక పెన్షన్ సమాజం దిశగా జనం వెళ్లాలనేది తమ ఉద్దేశమని, అందుకే తాము మరో ప్రోత్సాహకాన్ని ఇచ్చామని ఆయన చెప్పారు. నిజానికి యాన్యుటీ పథకాల్లో పెట్టుబడులపై పన్ను విధించడం జరుగుతుందని, అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇపిఎఫ్‌లోని సొమ్ము అతని వారసులకు బదిలీ అయినప్పుడు సైతం దానికి కూడా పన్ను మినహాయింపు వర్తించే విధంగా చేశామని అధియా చెప్పారు.