రాశిఫలం-02/25/2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ దశమి సా.5.27, కలియుగం - 5119 శాలివాహన శకం - 1939
నక్షత్రం: 
మృగశిర ఉ.7.29 త. ఆర్ద్ర రా.తె.5.49
వర్జ్యం: 
మ.3.18 నుండి 4.47 వరకు
దుర్ముహూర్తం: 
సా.04.24 నుండి 05.12 వరకు
రాహు కాలం: 
సా.4.30 నుండి 6.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) గౌరవం కోసం ఖర్చులు చేస్తారు. దానధర్మాలవల్ల శుభం కలుగుతుంది. సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని లాభాలున్నా అసంతృప్తి ఉంటుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనుకోని ఇబ్బందులుంటాయి. పనుల్లో జాగ్రత్త అవసరం. నూతన నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. గౌరవ లోపాలకు అవకాశం ఉంది. అనుబంధాల్లో ఇబ్బందులుంటాయి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) కార్యరంగంలో ఒత్తిడులున్నా శ్రమతో అధిగమిస్తారు. సహోద్యోగులు, అధికారులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ అనుబంధాల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) గృహ, వాహనాది సౌకర్యాలవైపు ఆలోచనలుంటాయి. ఆహార విహారాల కోసం ప్రయత్నాలుంటాయి. విందుల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. అధికారికమైన వ్యతిరేకతలు ఉండవచ్చు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలకు అనుకూలం. కార్యక్రమాల్లో శ్రమ తీవ్రంగా ఉంటుంది. నిర్ణయాలలో అనిశ్చితి ఉంటుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) సంతోషంగా గడుపుతారు. కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. ఒత్తిడులున్నా పనులు పూర్తిచేస్తారు. ఆలోచనలు ఫలిస్తాయి. అనుకూలత సిద్ధిస్తుంది. సౌఖ్యలోపం, విశ్రాంతి లోపాలకు అవకాశం ఉంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) వ్యతిరేకతలు అధిగమించాల్సి వస్తుంది. అన్ని పనుల్లో శ్రమ ఉంటుంది. కలహాలకు అవకాశం అధికం. ఋణబాధలుంటాయి. జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనల్లో అనిశ్చితి ఉంటుంది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అన్ని కార్యక్రమాలలోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. లాభాలు సంతృప్తినిస్తాయి. అనుకూలత సిద్ధిస్తుంది. ఆత్మీయతలు పెరుగుతాయి. ఒత్తిడి అధికం. అధికారులతో సంప్రదింపులుంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కార్యక్రమాలను సంతృప్తితో నిర్వహిస్తారు. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలుంటాయి. అధికారిక లాభాలుంటాయి. పితృవర్గ అనుకూలత సిద్ధిస్తుంది. శ్రమతో పనులు నిర్వహించాల్సి వస్తుంది.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) నూతన కార్యక్రమాల వైపు దృష్టి ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక భావాలకు అనుకూలం. కీర్తి ప్రతిష్ఠలవైపు దృష్టి ఉంటుంది
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) సమాచారం వైపు దృష్టి ఉంటుంది. సంప్రదింపులు జరుపుతారు. సహకార లోపాలకు అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంది. అధికారిక భాగస్వామ్యాలకు అనుకూలం. .
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కార్యక్రమాలవైపు దృష్టి ఉంటుంది. ఉన్నతమైన నిర్ణయాలుంటాయి. తృప్తిగా గడుపుతారు. గౌరవం, కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. శారీరకమైన శ్రమ ఉంటుంది
Date: 
Sunday, February 25, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి