జాతీయ వార్తలు

కన్నయ్యకుమార్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి : దేశద్రోహం కేసులో నిందితుడు, జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్యకుమార్ జైలునుంచి గురువారం సాయంత్రం విడుదలయ్యారు. పార్లమెంట్‌పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన తీవ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా జెఎన్‌యులో నిర్వహించిన ర్యాలీలో జాతివ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగంపై కన్నయ్యసహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహ నేరం మోపారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమై వివాదంగా మారింది. ఆ ర్యాలీలో కన్నయ్య దేశవ్యతిరేక నినాదాలు చేయలేదన్న వాదనల నేపథ్యంలో బుధవారం దిల్లీ కోర్టు కన్నయ్యకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా గురువారంనాడు అతడు జైలునుంచి విడుదలైనాడు.