అనంతపురం

‘ఆధార్’పై నో టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినట్లుగా వివిధ సేవలకు ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడం ప్రజలకు ఊరట కలిగించింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానంపై ఉన్న అనుమానాలు, తద్వారా వ్యక్తిగత వివరాల గోప్యతకు నష్టం వాటిల్లుతుందన్న వాదనలున్న తరుణంలో సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశం ఉన్న పథకాలకు మినహా మొబైల్ నంబర్లకు గానీ, బ్యాంకు అకౌంట్లకు గానీ, పాస్‌పోర్ట్ దరఖాస్తులకుగానీ, వినియోగంలో ఉన్న సిమ్‌కార్డులకు గాని, ఇతరత్రా ఏ విధమైన నిర్దేశిత సేవలకు ఈ నెల 31 లోగా ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రజల్లో టెన్షన్ తగ్గింది. ఇప్పటికే లక్షలాది మంది జిల్లాలో తమ ఫోన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. పాస్‌పోర్టులు పొందేందుకు మరింత జాగ్రత్త పడుతూ ఆధార్ అనుసంధానం చేస్తుండటం విశేషం. అన్నింటికీ ఆధార్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు ఆధార్ తప్పనిసరిగా కాదని, వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న వాదనలు, కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నప్పటికీ, కొన్ని సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఆధార్ కార్డు జత పర్చాల్సిందేనంటూ మొండిగా వ్యవహరిస్తున్నాయి. దీంతో జనంలో కూడా తాము ఏ విధమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందోనన్న భయాందోళనతో అవసరం ఉన్నా, లేకపోయినా, ఎటొచ్చి ఎటు పడుతుందోనన్న ఆదుర్ధా, అనుమానాలతో దరఖాస్తులకు ఆధార్ కార్డులను జత చేస్తున్నారు. మార్చి 31వ తేదీ గడువు దగ్గర పడుతుండటంతో శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను అంచనా వేసుకుని వీలు చేసుకుని మరీ పరుగులు పెడుతున్నారు. అయితే అత్యున్నత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో జనం తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అయినా ఆధార్ అనుసంధానం చేయకుంటే ఇబ్బంది కలుగుతుందేమోనని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుండటం కూడా కద్దు. అయితే ఆధార్ అనుసంధానం ఎంత సురక్షితం, వ్యక్తిగత సమాచారానికి ఏమాత్రం భద్రత ఉంటుందన్న విషయం తేలే వరకు ఉత్కంఠ తప్పదు.