కర్నూల్

రైతన్నను మింగేస్తున్న బీటీ-3 భూతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మార్చి 23: బీటీ-3 భూతం రైతన్నలను మింగేస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే, భూసారాన్ని గుళ్ల చేసే ఈ పత్తి విత్తన సాగు చాపకింద నీరుగా జిల్లాలో విస్తరిస్తోంది. మానవాళికి చెడు కలిగించే బీటీ-3 పత్తి విత్తనాల సాగుకు అనుమతి లేదు. అయినా బీటీ-3 విత్తనం సాగు చేస్తున్నారు. ఫలితంగా రైతన్నలు అంతుచిక్కని రోగాలతో మృత్యువాతపడుతున్నారు. బీటీ-3 సాగు చేసిన భూములు భూసారం కోల్పోయి గుల్ల అవుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లు, మొక్కలు పెరగడం లేదు. బీటీ-3 సాగుచేసిన తరువాత ఆ పొలంలో వేసిన పంటలు సరైన దిగుబడి రావడం లేదు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు.
బీటీ-2 పత్తికి గులాబీ రంగు పురుగుతో పాటు విపరీతమైన తెగుళ్లు సోకటమే కాకుండా కలుపు కూడా ఎక్కువగా ఉండేది. ఈ విధంగా తెగుళ్లు సోకి పంట దిగుబడి దాదాపు 45 శాతం తగ్గేది. ఈ నేపధ్యంలో బీటీ-3 పత్తి విత్తనాల ప్రస్తావన వచ్చింది. వీటి వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే గాక మానవాళికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం వాటిని సాగు చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినా రైతుల పొలాల్లో బీటీ-3 పత్తివిత్తనాల సాగు జరుగుతూనే ఉంది.
దేశంలో జన్యుమార్పిడి చేసిన బీటీ పత్తి విత్తనాలను పదిహేనేళ్ల క్రితం అమెరికాకు చెందిన మోన్‌శాంటో ప్రవేశ పెట్టింది. ఈ కంపెనీ బీటీ పత్తి విత్తనాలను ప్రవేశపెట్టిన్పటి నుంచి అనేక వివాదాలు తలెత్తాయి. తొలుత పచ్చ పురుగును తట్టుకుంటుందని బీటీ-1 రకం పత్తి విత్తనాలను దేశంలో 2002 నుంచి అమ్మకం ప్రారంభించారు. ఆ తర్వాత దీనికి తెగుళ్లను తట్టుకునే స్థాయి తగ్గిందని చెప్పి బీటీ-2 రకం పత్తి విత్తనాలను 2003లో తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీటీ-2 రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా బీటీ-2 పత్తి విత్తనాలతో సాగుచేస్తున్న పంటకు గులాబి రంగుతో పాటు ఇతర తెగుళ్లు విపరీతంగా సోకుతున్నందున సరైన దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు 5- 6 ఏళ్లుగా కూలీల వ్యయం అంతకంతకు పెరుగుతూవస్తోంది. దీనితో పాటు కలుపు నివారణకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీటి కారణంగా పత్తి దిగుబడి 45 శాతం తగ్గుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి 2009లోనే వెల్లడించింది. ఈ విధంగా ఒక హెక్టారుకు కలుపు తీయటానికి ఏడాదికి సగటున దాదాపు రూ.8 వేల వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుందని నివేదించింది.
ఈ లెక్కలను బహుళజాతి విత్తన, పురుగు మందుల సంస్థలు పరిగణలోకి తీసుకొని కూలీలతో పైర్లలో కలుపు తీయకుండా నేరుగా కలుపు మందును చల్లితే కలుపు మొక్కలు చనిపోయే విధంగా మందులను తయారు చేసి మార్కెట్‌లోకి తెచ్చాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో గ్లైసోసెట్ (గడ్డిమందు) పేరు గల విషపూరిత మందును తెచ్చాయి. ఈ మందును పొలాల్లో చల్లితే ఎటువంటి కలుపు మొక్కలైనా మాడి చనిపోతాయి. అయితే ఈ మందు చల్లితే బీటీ-2 పత్తి మొక్క కూడా చనిపోతోంది. ఆ గడ్డిమందును తట్టుకుని కొన్ని చోట్ల పత్తి మొక్కలు బతుకుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలు, జాతీయ పత్తిపరిశోధన సంస్థ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీయగా గ్లైపోసెట్ (గడ్డిమందు) ను తట్టుకుని బతుకున్న పత్తి మొక్కలు కొత్తరకం బీటీ-3 వంగడాలని నిర్ధారణ అయ్యింది. జాతీయ పత్తి పరిశోధన సంస్థ నివేదిక ఆధారంగా అనుమతి లేకుండా ఈ పత్తి విత్తనాలు ఎలా వచ్చాయి. అందుకు బాధ్యులైన వారిని గుర్తించి విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
వాస్తవానికి విదేశాల నుంచి జన్యుమార్పిడి (జిఎం) విత్తనాలు తేవాలన్నా, ఇక్కడ ప్రయోగాత్మకంగా, వాణిజ్యపరంగా సాగు చేయాలన్నా ముందుగా కేంద్ర పర్యావరణశాఖకు చెందిన జెనటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జిఈఏసి) అనుమతి ఇవ్వాలి. ఆ ప్రకారంగా మోన్‌శాంటో కంపెనీ కలుపు మందులను తట్టుకునే బీటీ-2 (రౌండప్ రెడీ ప్లెక్సీ) పత్తి విత్తనాలను 2006 నుంచి దేశంలోని 21 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించి పరిశీలన జరిపింది. ఈ బీటీ-2 పత్తి విత్తనాలనే బీటీ-3 పేరుతో రైతులకు అక్రమంగా అమ్ముతున్నారు. అలాగే ఈ విత్తనాలను ఆస్ట్రేలియా, కొలంబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో సాగుకు అనుమతించారని, భారత్‌లో సైతం వాణిజ్య మార్కెట్‌లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని 2013 మార్చిలో భారత జిఈఏసికి మోన్‌శాంటో తరపున మహికో సంస్థ దరఖాస్తు చేసింది. ఆ తర్వాత అనుమతులను త్వరగా ఇవ్వాలని కోరుతూ 2014 ఆగస్టు 21న పర్యావరణశాఖ మంత్రికి మరొక లేఖ రాసింది. అప్పటికే దేశంలో ఆవాల పంటకు సంబంధించిన జిఎం విత్తనాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసుకున్న దరఖాస్తుపై వివాదం నడుస్తోంది. 2017 వరకు జిఎం విత్తనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది.
ఈ నేపధ్యంలో జన్యు మార్పిడి (జిఎం) విత్తనాలకు లైసెన్స్ తప్పని సరని, అందుకు రుసుం నిర్ణయించి వాటిని నిత్యావసరాల చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విధానం తమకు నష్టదాయకంగా ఉందంటూ మహికో సంస్థ 2013 మార్చిలో బీటీ-2 ఆర్ ఆర్‌ఎఫ్ విత్తనాల వాణిజ్య అమ్మకాల అనుమతి కోసం పెట్టిన ధరఖాస్తులను ఉపసంహారించుకుంటామని, తమ విత్తన సమాచారం మొత్తం వెనక్కి ఇవ్వాలని 2016 జూలై 8న దరఖాస్తు చేసుకుంది. దీంతో అదే సంవత్సరం ఆగస్టు నెలలో మహికో కంపెనీకి జిఈఏసి సమాచారాన్ని వెనక్కి ఇచ్చేసింది. అ కంపెనీకి వాణిజ్య అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదని ఇక దేశంలో బీటీ-2 ఆర్‌ఆర్‌ఎఫ్ (రౌండప్ రెడి ప్లెక్సీ) పత్తి విత్తనాలు రావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. విచిత్రంగా 2015 నుంచి ఇదే రకం పత్తి విత్తనాలు దేశంలో అక్రమంగా రైతుల పొలాల్లోకి రావటం మొదలై దాదాపు 35 లక్షల ఎకరాలకు విస్తరించాయి. నిజంగా మోన్‌శాంటో (మహికో) సంస్థ 2006 నుంచి 2016 వరకు ప్రయోగాత్మకంగా సాగు చేసిన ఆ విత్తనాల సమాచారాన్ని వెనక్కి తీసుకుని ఉంటే ఇప్పుడు మార్కెట్లో రైతులు అక్రమంగా సాగు చేస్తున్న కలుపును తట్టుకునే బీటీ-3 రకం విత్తనాలు ఎవ్వరివో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది.