హైదరాబాద్

తనఖాతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మహానగరంలో రోజురోజుకీ అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నగరంలో రోజురోజుకీ భూమి ధరలు ఆకాశన్నంటుతున్నందున తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మించి, డొమెస్టిక్ బదులుగా కమర్షియల్ వినియోగం కూడా పెరుగుతోంది. ఏ మాత్రం సెట్‌బ్యాక్‌లు సైతం విడువకుండా ఈ బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. కాలవైపరీత్యాలు, ప్రమాదాలు వంటివి సంభవిస్తే ఇందులో చిక్కుకున్న వారి రక్షించటం సవాలుగా మారే అవకాశముంది.
బడా నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు భావిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు వంద చదరపు గజాల్లో నిర్మించే నిర్మాణాలకు కూడా మార్టిగేజ్(తనాఖ) నిబంధనను అమలు చేస్తే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయవచ్చునని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. నగరంలోని రాంనగర్‌లో కేవలం 40 చదరపు గజాల్లో ఏకంగా ఐదు అంతస్తులు నిర్మించిన భవనాన్ని గతంలో అధికారులు సీజ్ చేశారు. గత కొద్ది సంవత్సరాల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో 86 ప్రకారం ఇప్పటి వరకు సుమారు 200 చదరపు గజాల స్థలంలో నిర్మించే నిర్మాణాలకు సంబంధించి నిర్మించే మొత్తం భాగంలో పది శాతాన్ని జీహెచ్‌ఎంసీ తనాఖ పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన నిర్మాణ అనుమతి ప్రకారం, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నిర్మాణం చేపట్టి, అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ తీసుకుని, రిజిస్ట్రేషన్ శాఖకు సమర్పిస్తే తనఖా పెట్టున్న నిర్మాణ భాగం విడుదలవుతోంది. ఈ సర్ట్ఫికెట్‌ను సైతం పది శాతంలోపు ఉల్లంఘనలుంటే, వాటి తాలుకూ కాంపౌండింగ్ ఫీజును కట్టించుకుని జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేస్తోంది. పది శాతానికి మించి ఉల్లంఘనలకు పాల్పడితే తనాఖ పెట్టుకున్న భాగాన్ని జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకోవల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఎక్కడా కూడా జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకున్న దాఖలాల్లేవు. కానీ నగరంలో ఇటీవలి కాలంలో వంద చదరపు గజాల స్థలంలోనూ ఏకంగా నాలుగైదు అంతస్తుల భవనాలు వెలుస్తుండటం, నిర్మాణంలో ఇష్టారాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నటు గుర్తించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు తనాఖ నిబంధనను వంద చదరపు గజాల స్థలంలో నిర్మించే వాటికి కూడా వర్తింపజేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కారుకు పంపింది. ఈ తనాఖ నిబంధనను వంద చదరపు గజాల స్థలంలో నిర్మించే నిర్మాణాలకు కూడా అమలు చేస్తే తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను కొంత మేరకైనా అడ్డుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు.