అనంతపురం

భక్తులతో కిటకిటలాడుతున్న తిమ్మమ్మ మర్రిమాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంబులపూలకుంట, మార్చి 7: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను సన్నిధిలో జరిగే తిమ్మమాంబ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తిమ్మమ్మ మర్రిమాను భక్తులతో కిటకిటలాడిం ది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం అమ్మవారికి అభిషేకం, మంగళహారతి, తీర్థప్రసాద వినియో గం కార్యక్రమాలను నిర్వహించారు. గంగరాజు వంశస్తులు శివరాత్రి పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలు పట్టి ప్రత్యేక పూజలు చేశారు. గంగరాజు వంశస్తులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కొత్తకోట, తంబళ్ళపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో నివాసం వున్నా ఉత్సవాలు పురస్కరించుకొని ప్రతి ఏడాది తరలివచ్చి బోనాలు పట్టి పూజలు చేయడం జరుగుతుందని స్థానికులు వివరించారు. తిమ్మమ్మ మర్రిమాను సందర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకున్నారు.

ఘనంగా శివపార్వతుల కల్యాణోత్సవం
లేపాక్షి, మార్చి 7: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి శ్రీదుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి దేవాలయంలో సోమవారం శివరాత్రి పర్వదిన సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం భక్తజన సందోహం మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు దుర్గాదేవి, వీరభద్రస్వామి, పాపనాశేశ్వరులకు అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం దీపోత్సవ కార్యక్రమాన్ని ఉపవాస దీక్షలతో మహిళలు నిర్వహించారు. అదే విధంగా ఆగమీకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో రుద్రహోమాన్ని నిర్వహించారు. తరువాత కాలసర్ప దోష నివారణ పూజలను ఏడు పడగల నాగేంద్రుని వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి భక్తులు వేద పండితులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో అభిషేకార్చనలు నిర్వహించారు. నాట్య మండపంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని శివనామస్మరణతో భక్తుల మధ్యన ఎంతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు శివపార్వతులను వృషభ వాహనోత్సవాన్ని లేపాక్షి పురవీధుల్లో ఊరేగించారు. అదే విధంగా మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఆరు గంటల నుండి నాలుగు యామముల పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజా కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. మంగళవారం శివపార్వతుల బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.

పంపనూరు ఆలయంలో కైలాసద్వార ప్రవేశం
ఆత్మకూరు, మార్చి 7 : మండల పరిధిలోని పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం మహాశివరాత్రి సందర్బంగా ఆలయంలోకి వచ్చే భక్తులకు కైలాసద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ద్వారానికి ఎదురుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తుల వ్యక్తిగత ఉపయోగార్థం మహారుద్ర హోమాలు నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మట్టి శివలింగాలకు భక్తులచే అర్చనలు చేయించారు. 6 గంటల తర్వాత గంగాగౌరీ సమేత మంజునాథస్వామివారికి కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. శివరాత్రి జాగరణ సందర్బంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ప్రతి మూడు గంటలకొకమారు మంజునాథస్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి సందర్బంగా అన్నదానం బదులు అల్పాహారం ఏర్పాటుచేశారు. పంపనూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణ ప్రాంతం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి వివిధ రకాల పూజలు చేయించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో శివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవాలు, ఆలయాలలో భజన కార్యక్రమాలతో జాగరణ చేశారు.
శివలింగాల ఊరేగింపు
ఆత్మకూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఓంశాంతి వారి ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై శివలింగాలకు అలంకరణ చేసి ఊరేగించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకురాలు రాజయోగిని శివలింగమ్మ భక్తులకు ఈశ్వరీయ సందేశమిచ్చారు.
కళ్యాణదుర్గంలో...
కళ్యాణదుర్గం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం కళ్యాణదుర్గంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారమే శివరాత్రి రావడంతో దుర్గంలోని అన్ని దేవాలయాల్లోను ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైవక్షేత్రాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూలతో పాటు, హోమాలు నిర్వహించారు. స్థానిక పూరాతన శైవక్షేత్రం శ్రీ భావానిశంకర్ దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు, పరమశివుడికి కల్యాణం నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో స్వామికి వేదపందితులు శివనామగోశతో కల్యాణం గావించారు. వేలాది మంది భక్తులు స్వామి దర్శునం చేసుకున్నారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. పట్టణంతో పాటు గ్రామాల్లో వున్న శివాలయాల్లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి దర్శనం చేసుకున్నారు. శివరాత్రి పర్వదినాన పలువురు భక్తులు ఉపవాసం పాటిస్తు జాగారణ చేశారు.