జాతీయ వార్తలు

పోలీసు కస్టడీలో బాధితురాలి తండ్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నావో (యూపీ), ఏప్రిల్ 9: భాజపా ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెన్‌గర్ అత్యాచారం జరిపాడని ఆరోపించిన 18 ఏళ్ల బాధితురాలి తండ్రి సోమవారం పోలీసు కస్టడీలో మృతి చెందడంతో యుపిలోని భాజపా ప్రభుత్వం ఇరుకున పడింది. గత రాత్రి 50 సంవత్సరాల వయసున్న ఆమె తండ్రి జైల్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడు. ఏప్రిల్ 5, ఆయుధ చట్టం కింద అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సహజంగానే ఈ వార్త విపక్షాల చేతికి మంచి అస్త్రాన్నిచ్చింది. ఇది భాజపా ప్రభుత్వం చేసిన హత్య అంటూ వారు విరుచుకుపడ్డాయి. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ నిందితులపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ సంఘటన జరగడంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. అయితే సెన్‌గర్ మాత్రం ఇదంతా విపక్షాల కుట్రలో భాగమని ఆరోపిస్తున్నారు. ‘వారు తక్కువ కులానికి చెందినవారు. దీన్ని ఆధారం చేసుకొని విపక్షాలు నాపై కుట్ర పన్నుతున్నాయి’ అని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి ఈ సంఘటనపై నివేదిక కోరారు. నిందితులను వదిలిపెట్టబోనని మరోమారు హామీ ఇచ్చారు. అయితే తమ కుటుంబంపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. వారు బెదిరించిన విధంగానే మా తండ్రిని చంపేశారంటూ విలపించింది.