క్రీడాభూమి
గృహహింస కేసులో షమీకి సమన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోల్‌కతా, ఏప్రిల్ 17: భారత మీడియం పేస్ బౌలర్ మహ్మద్‌కి కష్టాల మీద కష్టాలు పడి వస్తున్నాయి. గృహహింస చట్టం కింద అతని భార్య హసీన్ జహాన్ అలీపుర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో కోల్‌కతా పోలీసులు షమీకి సమన్లు జారీ చేశారు. షమీతోపాటు అతని సోదరుడు హసిబ్ అహ్మద్‌ను విచారణ కోసం తమ ఎదుట బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కావాలని కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. హసీన్ జహాన్‌కు షమీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసులు వేసిన తర్వాత రూ.లక్ష చెక్ ఇస్తే అది కూడా బౌన్స్ అయిందని ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించాడు. హసీన్ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాల కోసం రూ.7 లక్షలు, కుమార్తె ఐరా ఖర్చుల కోసం అదనంగా మరో రూ.3 లక్షలు షమీ నుంచి తక్షణమే ఇప్పించాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ కేసులో దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని కోల్‌కతా పోలీసులను అలీపూర్ కోర్టు ఆదేశించింది. షమీ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని, తనను మానసికంగా వేధించాడని, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని జహాన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షమీ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.