క్రీడాభూమి

ఆసీస్ క్రికెట్‌కు కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్: ఆస్ట్రేలియా క్రికెట్‌కు కొత్త రూపురేఖలను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని, అభిమానుల విశ్వాసాన్ని మళ్లీ సంపాదించుకునేందుకు కృషి చేస్తానని ఆ జట్టు కొత్త కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన మూడో టెస్టులో చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన కారణంగానే ట్యాంపరింగ్‌కు పాల్పడిన కామరాన్ బాన్‌క్రాఫ్ట్, సూత్రధారి, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తోపాటు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా నిషేధానికి గురయ్యారు. మూడో టెస్టు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన వెలుగు చూడడంతో, తక్షణమే కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతని స్థానంలో బాధ్యతలను పైన్‌కు అప్పచెప్పింది. చివరిదైన నాలుగో టెస్టుకు కూడా పైన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, తాత్కాలికంగా పగ్గాలు అప్పగించిన పైన్‌ను రెగ్యులర్ కెప్టెన్‌గా సీఏ నియమించింది. అధికారికంగా బాధ్యతలు తీసుకున్న 33 ఏళ్ల పైన్ గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా సంఘటనతో జట్టుపై చాలా మంది అభిమానులు నమ్మకం కోల్పోయారని అన్నాడు. వారిని తిరిగి స్టేడియాలకు రప్పించాలన్నా, క్రికెట్ పట్ల గతంలో మాదిరిగానే నమ్మకం పెంచాలన్నా, సరికొత్త విధానాలను అమలు చేయకతప్పదని స్పష్టం చేశాడు. మ్యాచ్‌లను గెలిచేందుకు ఎవరికి తోచిన విధానాలను వారు అవలంభిస్తారని, అయితే, జట్టుపై నమ్మకం కోల్పోయే రీతిలో అవి ఉండకూడదని అంటూ దక్షిణాఫ్రికా సంఘటనను అతను పరోక్షంగా విమర్శించాడు. దేశం గర్వించేలా తమ జట్టు పోరాటాలు సాగిస్తుందని పైన్ చెప్పాడు.
కోచ్ కోసం వేట
డారెన్ లీమన్ స్థానంలో చీఫ్ కోచ్‌గా కొత్త వ్యక్తిని ఎంపిక చేయడానికి వేట కొనసాగుతున్నదని సీఏ ప్రకటించింది. కోచ్ పదవికి ఇప్పటికే ఆసీస్ మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్‌ను ఎంపిక చేసినట్టు వచ్చిన వార్తలను సీఏ తోసిపుచ్చింది. ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని, ఈ విషయంపై శుక్రవారం జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపింది. కాగా, అదే రోజు కొత్త కోచ్ పేరును ప్రకటిస్తారని సమాచారం.

చిత్రం..నూతన కెప్టెన్ టిమ్ పైన్