మెదక్

‘రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, ఏప్రిల్ 26: రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగంపేట సొసైటి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నగేష్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల శ్రేయస్సు కోసమే సీఎం కేసీఆర్ దృఢ నిశ్చయంతో ఎకరాకు నాలుగు వేలు పెట్టుబడులకు ఉచిత భీమా ఐదు లక్షలు, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. జేసీ నగేష్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధర పొందాలన్నారు. ధాన్యాన్ని విక్రయించిన 72 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు.

ఫేస్‌బుక్ సమాచారంతో స్పందించిన మంత్రి
గజ్వేల్, ఏప్రిల్ 26: గజ్వేల్ మండలం అనంతరావుపల్లికి చెందిన దార రవి పదిరోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకోగా, చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతను ఇనె్ఫక్షన్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో రవి చేతిని వైద్య సిబ్బంది తొలగించగా, మెరుగైన చికిత్స అందించని పక్షంలో ప్రాణాపాయం ఉందని కూడా వైద్యులు సూచించారు. విషయాన్ని రవి మిత్రులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌తో వివరాలు సేకరించారు. అయితే మెరుగైన చికిత్స అందించేందుకు రూ. 3లక్షల ఆర్థిక సహాయం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించగా, అవసరమైన పక్షంలో మరింత డబ్బు మంజూరు చేస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. పేదరికం అనుభవిస్తున్న రవి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేయగా, ఈ మేరకు గురువారం బాధిత కుటుంబసభ్యులకు టీఆర్‌ఎస్ నేతలు రూ. 3లక్షల సీఎంఆర్‌ఎఫ్ మంజూరు పత్రాన్ని అందజేశారు.