జాతీయ వార్తలు

ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను నామినేట్ చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: కర్నాటక అసెంబ్లీలో ఆంగ్లోఇండియన్ మెంబర్‌ను నామినేట్ చేయాలని గవర్నర్ వాజుభాయి తీసుకున్న నిర్ణయా న్ని నిలిపివేయించాలని, విధానసభలో బీజేపీ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకునే వరకు ఈ ప్రక్రియను ఆపుచేయించాలని కాంగ్రె స్, జేడీ(ఎస్) గురువారం సుప్రీంను ఆశ్రయించాయి. కర్నాటక అసెంబ్లీ లో మొత్తం 224 మంది సభ్యులుండగా, ఆంగ్లో ఇండియన్ మెంబర్ ను నామినేట్ చేస్తే ఆ సంఖ్య 225కు చేరుతుంది. గురువారం మధ్యా హ్నం దాఖలు చేసిన ఈ పిటిషన్ ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్‌లు దాఖ లు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటు శుక్రవారం విచారణకు వస్తుంది. ఆంగ్లో ఇండియన్ సభ్యురాలిగా విన్షా నీరోను నియమించి ఆమెతో శుక్రవారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రకటన వెలువడింది. అయితే బీజీపీ సభలో మెజారిటీ నిరూపించుకునే వరకు నామినేట్ చేయరాదని ఇరు పార్టీలు సుప్రీం కోర్టును కోరాయి.