రాశిఫలం -- 24-05-2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ దశమి రా.8.10 -- కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
ఉత్తర రా.9.45
వర్జ్యం: 
శేషవర్జ్యం: ఉ.7.03 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ. 2.48 నుండి 3.36 వరకు
రాహు కాలం: 
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండాలి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.).) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొందుతారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు.ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు.
Date: 
Thursday, May 24, 2018