హైదరాబాద్

10 రంగాల్లో అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రంగారెడ్డి జిల్లాలో 10 రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశమై రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ పై సమీక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్, జెడ్‌పీ కార్యాలయం, ఇతర ప్రముఖ ప్రదేశాలలో విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమర వీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళి సమర్పించాలని సూచించారు. జిల్లాల్లో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లలోనూ, జిల్లా కేంద్రాలలోనూ, మున్సిపాలిటీల్లో, అంగన్‌వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం బాద్యతలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు చెప్పారు. ప్రథమ చికిత్స ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్, 108, అందుబాటులో ఉంచాలని జిల్లా వైధ్యాదికారిని ఆదేశించారు. జిల్లా అగ్నిమాపక అధికారికి ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వేదిక, పూల అలంకరణ పనులు చూడాలని, జిల్లా ఉద్యానవన శాఖాదికారినిని ఆదేశించారు. గ్రౌండ్ ఏర్పాట్లను ఆర్‌ఎండీబీ, అధికారులు ఈ సంవత్సరం కూడా 10 రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నట్లు జేసీ పేర్కొంటూ వారిని ఎంపిక చేసేందుకు సంబంధిత అధికారులు నియమ నిబందనలను రూపొందించుకోవాలని అన్నారు.
28లోగా దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రంగారెడ్డి జిల్లాలో వివిద రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నట్లు జిల్లా స్థాయి అవార్డులకై దరఖాస్తు చేసుకునే వారు మే 28 సాయంత్రం 5 గంటల లోగా సంబంధిత జిల్లా అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తులు అందజేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్ తెలిపారు.