జాతీయ వార్తలు

ఖమ్మంనుంచి మేము..నల్గొండ నుంచి సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధాన మండలి ఎన్నికల్లో పోటీపై సిపిఐ కార్యదర్శి చాడ వెల్లడి
న్యూఢిల్లీ, నవంబర్ 28: తెలంగాణలోని స్థానిక సంస్థల నుంచి విధాన మండలికి జరిగే ఎన్నికలలో సీపీఐ ఖమ్మం నుంచి, సీపీఎం నల్లగొండ నుంచి పోటీ చేస్తాయని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలియచేశారు. త్వరలోనే అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని ఆయన విలేఖరులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రాణహిత- చేవెళ్ల నీటిపారుదల పథకాన్ని జాతీయ పథకంగా చేపడతామని చేసిన హామీ గురించి ఇప్పుడు కేంద్రం పెదవి విప్పటం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణా ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమవుతోందని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూము ఇళ్ల నిర్మాణం సమస్యలకు దారి తీస్తోందని ఆయన తెలిపారు. ఒకొక్క నియోజక వర్గానికి నాలుగు వందల గృహాలనే కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లబ్ధి పొందాల్సిన వారిలో అసంతృప్తి కలుగుతోందని ఆయన చెప్పారు. నాలుగు వందల ఇళ్లను మాత్రమే నిర్మించిన పక్షంలో ఇళ్ల కొరత ఎప్పటికి తీరుతుందని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న ఐదు లక్షలమందికి ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించటం లేదని చెప్పారు. తమకు రావలసిన నిధులు అందకపోవటంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నార ని చెప్పారు.