క్రీడాభూమి

భారత్‌లో మాకు లభించేవి ప్రేమాభిమానాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్చరికలు, బెదిరింపులు కావన్న పాక్ కెప్టెన్ అఫ్రిదీ

కోల్‌కతా, మార్చి 13: భారత్‌లో తమకు ప్రేమాభిమానాలు లభిస్తాయే తప్ప బెదిరింపులు, హెచ్చరికలు కావని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ అన్నాడు. ఆదివారం నెట్స్‌కు హాజరైన అతను ఆతర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్‌లో తమకు ఎలాంటి సమస్యలు తలెత్తబోవని స్పష్టం చేశాడు. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆడుతున్నప్పుడే తనకు ఎక్కువ ఆనందంగా ఉంటుందన్నాడు. పాకిస్తాన్‌లోనూ తమకు భారత్‌లో లభించినంత ఆదరణ దక్కదని వ్యాఖ్యానించాడు. పాక్‌లో మాదిరిగానే భారత్‌లోనూ క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెప్పాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌ని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని అఫ్రిదీ అన్నాడు. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుందని అన్నాడు. అంతకు మించి ఫలానా జట్టుతో ఆడితే ఒత్తిడి ఎక్కువ లేదా తక్కువ అంటూ ఏమీ ఉండదని అన్నాడు. మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే భారత్‌తో జరిగే మ్యాచ్ కూడా ఒకటని, దానికి ప్రత్యేకతలు అంటూ ఏమీ లేవని వ్యాఖ్యానించాడు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశాడు. భద్రతా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. తన భార్య సానియా మీర్జా భారతీయురాలేనని, కాబట్టి తాను తరచు ఇక్కడికి వస్తుంటానని చెప్పాడు. ఎప్పుడూ తనకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తలేదని మాలిక్ తెలిపాడు. భద్రతను ఉటంకిస్తూ పాకిస్తాన్ సర్కారు చివరి క్షణం వరకూ క్లియరెన్స్ ఇవ్వని విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, తాను రాజకీయాలు మాట్లాడబోనని మాలిక్ స్పష్టం చేశాడు. రాజకీయాల గురించి తనకు తెలియదని, రెండు దేశాలనూ దగ్గర చేసే శక్తి క్రీడలకు ఉందని మాత్రమే తాను నమ్ముతున్నానని తెలిపాడు. అండర్ డాగ్ ముద్ర తమకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించాడు. ఎవరికీ అసాధారణ అంచనాలు ఏవీ లేనప్పుడు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుందని చెప్పాడు.