Others
ఔను నిజం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 June 2018
-పుట్టి గిరిధర్ 9491493170
ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికి మొబైల్ ఫోన్లతో
అందరినీ కలిపే పలకరింపులతో,
అవే అసంతృప్త కడుపులతో!
ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికి చేరిన టీవీలతో
అందమైన ప్రపంచం వీక్షిస్తూ,
అవే ఎడారి చూపులతో!
ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికీ సరిపడే కరెంటుతో
వెలుగులు నింపే బల్బులతో,
అవే చీకటి బతుకులతో!
ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికీ అందించే నీళ్లతో
ఊరంతా పారే ప్రాజెక్టులతో,
అవే దాహపు గొంతులతో!
ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికీ వచ్చే ధాన్యాలతో
పంటపంటకీ నిండే ధనంతో,
అవే గిట్టుబాటు లేని ధరలతో!
ఔను
నా పల్లె ఎంతో మారింది!
నీవు నేను మారినంత భ్రమగా
ఆకాశంలో విహరించినంతగా,
అవే నేల మీది నడకలతో!
*