మెదక్

సర్వాంగ సుందరంగా మెదక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 16: మెదక్ జిల్లా కేంద్రం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోడానికి ఒక ప్రణాళికను రూపొందించినట్లు శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ పురపాలక సంఘ కార్యాలయంలో 12 లక్షల వ్యయంతో ఐదు బ్యాటరీ ట్రాలీ ఆటోలను ఆమె ప్రారంభించారు. ఆ తరువాత విలేఖరులతో మాట్లాడుతూ నిధుల కొరతను తీర్చుకునేందుకు ఒక కోటి రుపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోబోతున్నట్లు ఆమె తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా పైప్‌లైన్ నిర్మించడం వలన రోడ్డు బాగా దెబ్బతిన్నాయని, వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్లను మెరుగుపర్చడానికి మజీదుల వద్ద డ్రైనేజీల నిర్మాణానికి 50 లక్షలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. నేషనల్ హైవే రోడ్డు మంజూరైందని, ఇంటర్నల్ రోడ్ల కోసం ఐదు కోట్ల రుపాయలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. పెద్దబజార్ రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం కోసం ఐదు కోట్ల రుపాయలు కేటాయించినట్లు తెలిపారు. వేరే స్థలంలో పురపాలక భవనం నిర్మించబోతున్నట్లు ఆమె తెలిపారు. తొలుత వచ్చిన 15 కోట్ల రూపాయలే కాకుండా మరో 15 కోట్ల రుపాయలు అతి త్వరలో మంజూరు కానున్నట్లు ఆమె తెలిపారు. ఈ విధంగా మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. భవిషత్తు తరానికి మంచి వాతావరణం కల్పించే దిశగా మెదక్ పట్టణాన్ని మార్చబోతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఆగస్టులో ఇంటింటికి సింగూర్ నుండి శుద్ధినీరు సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురైన మెదక్ జిల్లా కేంద్రం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం ద్వారా శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా మెదక్‌పై ఉన్న అపోహలు తొలగిపోయాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, కమిషనర్ సమ్మయ్య, గంగాధర్, కౌన్సిలర్ చంద్రకళ, మాయ మల్లేశం, ఐతారం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

రైతుల స్వేదానికి వెలకట్టలేం
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడదాం: సినీనటి ఝాన్సీ* సాగులో సహకారంకై ఒప్పందం

జహీరాబాద్, జూన్ 16: దేశంలోనే ఎక్కడాలేని విధంకా మొట్టమొదటిసారిగా డెక్కన్ డెవల్‌మెండ్ సొసైటీ(డీడీఎస్)చిరుధాన్య మహిళా రైతులు, దిశా వినియోగ దారులకు మధ్య పరస్పరం ఉత్పత్తి, కొనుగోలుపై ఒప్పందం జరిగిందని సీనీ నటి, బుల్లితెర యాంకర్, ఆరోగ్యం-పర్యావరణ కార్యకర్త ఝాన్సీ అన్నారు. ఇలాంటి ఒప్పందాలకు డీడీఎస్ నాంది పలకడం గర్వకారణమన్నారు. శనివారం దిశా ఫౌండేషన్ సభ్యులు డీడీఎస్ సంఘం చిరుధాన్య మహిళా రైతుల పొలాలను సందర్శించారు. లచ్చనాయక్ తండాలో సాగుపద్ధతులు, విత్తనాలను ఇతర వివరాలలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీడీఎస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ రైతుల స్వేదానికి వెలకట్టలేమన్నారు. డబ్బులిచ్చి మార్కెట్లో అనారోగ్యాన్ని కొంటున్నామన్నారు. రైతులతో కలిసి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని, ఆరోగ్యవంతమైన సమాజంకోసం పాటుపడదామని వినియోగదారులకు పిలుపు నిచ్చారు. డీడీఎస్ డైరెక్టర్ పీవీ.సతీష్ మాట్లాడుతూ కలిపి పండలను, కలిసి చేద్దామంటూ దిశా సంస్థ వినియోగ దారులు ముందుకు రావడం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ముందడుగు పడినట్లయిందన్నారు. పంట సాగు దశనుంచి వినియోగదారులు కూడా బాధ్యతగా రైతుకు తమ సహకారం అందించేందుకు ముందుకు రావడం చారిత్రాత్మకమన్నారు. దీంతో భూమాత, పర్యావరణం, పశు, పక్షులకు చిరుధాన్య సాగుతో మేలు జరుగుతుందన్నారు. దశా కన్వీనర్ డాక్టర్ డి.రాజు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు కొంటామంటూ మందుకు వచ్చిన వినియోగదారులు, మీరు కోరిన పంటలు కేవలం వర్షాధారంగా సేంద్రియ పద్దతిలో పండించినవి అందిస్తామంటూ మహిళా రైతులు ముందుకు వడంతో కుదిరిన ఒప్పందం దేశంలోనే ప్రథమమన్నారు. గతంలో జరిగిన ఒప్పందాలన్నీ ఆర్థిక కోణంలో జరిగిన ఒప్పందాలుకాగా, ఈ ఒప్పందం కేవలం సామాజిక కోణంలో జరిగింది. 20 రకాల పంటలు అందించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. 2016నుంచి డీడీఎస్‌ను అనుసరిస్తూ 2018లో వారితో కలిసి నడుస్తున్నందుకు ఆనందం వ్యక్తంచేశారు. హైదరాబాద్ యునివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్. వినోద్ పావురాల మాట్లాడుతూ డీడీఎస్‌కు ఎప్పుడొచ్చినా కొత్తవిషయాలు నేర్చుకుంటూనే ఉంటామన్నారు. కొనే్నళ్లుగా వీరు ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ యజ్ఞం నిర్విగ్నంగా నిర్వహించారన్నారు. వ్యవసాయ జర్నలిస్టు లతాజిస్మా మాట్లాడుతూ దేశంలో రైతులు అనేక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వాలు వారిని ఆదుకోవడంలో విఫలమవుతున్నాయన్నారు. న్యాయంకోసం ఆదోళనకు దిగితే విచక్షణా రహితంగా కాల్పులు జరిపిస్తున్న సంఘటనలు దురదృష్ట కరమన్నారు. రైతులు, వినియోగదారుల మధ్యన కుదిరిన ఈ ఉత్పత్తి, కొనుకోలు ఒప్పందం గ్రీన్ రెవల్యూషన్‌కు నాంది కాగలదన్నారు. రైతులు మొగులమ్మ, చక్రీ బాయిలు మాట్లాడుతూ పత్తిలాంటి మహమ్మారి రావడంతో చిరుధాన్యాలు సాగుచేస్తున్న మహిళా రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయన్నారు. అయినా రోశంతో వాటిని వదలబోమన్నారు. సాగుచేసిన చిరుధాన్య పంటలు పక్షులపరమై నష్టాల పాలయ్యామన్నారు. కానీ డీడీఎస్ సంస్థ అండతో సాగుకు ఉపక్రమించామన్నారు. వినియోగదారులు తోడైతే చిరుధాన్య సాగు మరింత మెరుగవుతుందన్నారు. గతంలో అడవి జంతువులు, పక్షుల ద్వారా వచ్చిన నష్టాలు ఇకముందు రైతుల దరిచేరకుండా తాము అండగా ఉంటామంటూ వినియోగదారులు ముందుకు రావడంతో తమకు మరింత బలమొచ్చిందన్నారు. గ్రామం యూనిట్‌గా డీడీఎస్ సంఘాలున్న ఆరు గ్రామాలను ఎంపికచేశారు. ఒక్కో గ్రామంలో 25 ఎకరాలకు, 20 రకాల పంటలకు తగ్గకుండా చిరుధాన్య సాగును చేపట్టేలా 206 ఎకరాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామ రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రధానంగా డీడీఎస్ మహిళా రైతలు చేస్తున్న కలిపి పంటలను-కలిసి సాగుచేద్దామన్న నినాదంతో రైతులు, వినియోగదారు సాగుతున్నారు. విత్తనం వేసింది మొదలు కలుపు, కోత, నూర్పిడి, వర్షపాతం తదిర అన్ని అంశాల్లో వినియోగ దారులు పాలు పంచుకునేలా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని చారిత్రక ఒప్పందంపై సర్వత్రా రైతు, వినియోదారు లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమావేశంలో దిశా వినియోగదారుల ఫోరం సభ్యులు, డీడీఎస్ సంఘం మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.