హైదరాబాద్

పునర్వవస్థీకరణ ఫలించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీని పరిధిలోని ప్రస్తుతం 30 సర్కిళ్లను 50కి పెంచుతూ స్థారుూ సంఘం, అధికారులు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందోనన్న విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికపుడు జీహెచ్‌ఎంసీలో సర్కిళ్లను పెంచుతున్నారే తప్పా, అందుకు తగిన సిబ్బంది, ఆఫీసులను సమకూర్చటంలో అటు ప్రభుత్వం, ఇటు బల్దియా ఉన్నతాధికారులు కూడా విఫలమవుతున్నారు. ఫలితంగా పౌరసేవల నిర్వాహణ, నగరంలో దీర్ఘకాలికంగా నెలకొన్న పలు సమస్యలకు సంబంధించి సామాన్యులకు కష్టాలు తప్పేట్టు లేవు. 2007 వరకు కేవలం ఏడు సర్కిళ్ల కోర్ సిటీ పరిధికే పరిమితమైన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి అప్పటి ప్రభుత్వం శివార్లలోని పదకొండు మున్సిపాల్టీలను విలీనం చేస్తూ గ్రేటర్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే! అప్పటి నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో ప్రతి సంవత్సరం సర్కిళ్ల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 50కి చేరింది. గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 18 సర్కిళ్లు, ఆ తర్వాత సోమేశ్‌కుమార్ కమిషనర్‌గా ఉన్నపుడు 2014లో 24కు పెంచారు. ఈ 24 సర్కిళ్లు ఎంతో కాలం అమలు కాకముందే వీటి సంఖ్యను 30కి పెంచారు. ఇపుడు తాజాగా 50 సర్కిళ్లు, పది జోన్లకు పెంచుతూ అధికారులు ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు స్థారుూ సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. ఏడు నుంచి 18కి సర్కిళ్లు పెరిగినపుడు కూడా అదనంగా అవసరమైన సిబ్బంది సమకూర్చుకోవటంపై ప్రభుత్వం గానీ, జీహెచ్‌ఎంసీ గానీ దృష్టి సారించలేదు. మరీ అవసరమనుకుంటే ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకుంటూ వస్తోంది. ఫలితంగా ఉన్న సిబ్బంది, అధికారులపై పని భారం తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఒక్కో సర్కిల్‌లో మూడు మున్సిపల్ డివిజన్లను కేటాయిస్తూ వీటిని ఏర్పాటు చేశారు. త్వరలోనే పది జోన్లకు సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశముంది. కొంతకాలం క్రితం వరకున్న 24 సర్కిళ్లను 30కి పెంచటంతో పలు సర్కిళ్లలో ఒకే కార్యాలయంలో రెండు విభాగాలకు చెందిన అధికారులు షేరింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 30 సర్కిళ్లకు పెంచినప్పటి నుంచి సర్కిళ్లు, జోన్ల ఆఫీసుల్లో అధికారులు సిబ్బంది ఎదుర్కొంటున్న కష్టాలు ఇంకా తీరకముందే, సమస్యలు పరిష్కారం కాకముందే కనీసం వౌలిక వసతులు కూడా సమకూరకముందే సర్కిళ్లను 50కి పెంచటం మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టు కానుంది. నేటికీ సర్దార్ మహాల్ వంటి పలు బల్దియా ఆఫీసుల్లో ఒకే టేబుల్‌పై ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్న సందర్భాలున్నాయి.
ఈ క్రమంలో 50 సర్కిళ్లుగా ఏర్పాటు చేస్తే ఇప్పటికే కనీసం కూర్చునేందుకు కుర్చీల్లేని పలు సర్కిల్ ఆఫీసుల్లో వివిధ విభాగాలకు సంబంధించి వచ్చే అధికారులకు ఆఫీసులు ఎక్కడ కేటాయిస్తారు? లేక ఇప్పటికే ఒక టేబుల్‌కున్న రెండు కుర్చీల పక్కనే మరో కుర్చీ వేస్తారా? అన్న చర్చ లేకపోలేదు.