మెదక్

సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, జూన్ 23: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అనారోగ్యం భారిన పడిన అభాగ్యులను ఆదుకోవడంలో సీఎం సహాయనిధి ప్రధాన భూమికను పోషిస్తోందని కొనియాడారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన నాలుగు లక్షల రూపాయల విలువ గల ఎల్‌ఓసీలు అందచేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కమల్‌పల్లి గ్రామానికి చెందిన సీహెచ్ సత్తిరెడ్డికి లక్ష రూపాయలు, పటన్‌చెరు మండలం ఐనోలు గ్రామానికి చెందిన రాజుయాదవ్ కుమార్తె చికిత్స నిమిత్తం మూడు లక్షల రూపాయల విలువైన ఎల్‌ఓసిలు మంజూరైనాయి. లబ్దిదారులకు ఎల్‌ఓసీలు అందచేసిన అనంతరము మాట్లాడుతూ ఆర్థిక రేఖకు దిగువన ఉన్న పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశ పెడుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులను బాగా మెరుగు పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం భారిన పడిన వారికి సహాయనిధి ద్వార మరింత సహకారాన్ని అందిస్తున్నారన్నారు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా వైద్యం అందించడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వ్యయం చేస్తోందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు గొల్ల శ్రీశైలంయాదవ్, ఐనోలు సర్పంచ్ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుబీమాను సద్వినియోగం చేసుకోండి
* ఎమ్మెల్యే బాబుమోహన్
జోగిపేట, జూన్ 23: రైతు బీమాను సద్వినియోగపర్చుకోవాలని అందోల్ శాసనసభ్యులు బాబుమోహన్ అన్నారు. శనివారం అందోల్ మండల పరిధిలోని కనుసాన్‌పల్లి గ్రామంలో రైతుబీమా పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను అమలు చేయడం పట్ల రైతుల ఇబ్బందులు తొలగుతాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి కూడా ఎంతగానో కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రైతులందరు సంతోషంగానే ఉన్నారన్నారు. పెట్టుబడులకు సాయం అందడం, వర్షాలు సకాలంలో కురియడంతో ఖరీఫ్ పంటలు అధిక దిగుబడులతో పండే అవకాశం ఉందన్నారు. రైతులు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి.నాగభూషణం, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మీ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, మాణిక్యరెడ్డి, లింగన్న, వెంకటేశం, ఖాజా పాషా, లక్ష్మణ్, గోపాల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.