జాతీయ వార్తలు

50ఏళ్ల తరువాత సైనికుడి మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూలై 21: విమానం ప్రమాదంలో చనిపోయిన సైనికుడి మృతదేహాన్ని ఏభై ఏళ్ల తరువాత పర్వతారోహకుల బృందం కనుగొంది. 1968 ఫిబ్రవరి 7న చండీగఢ్ నుంచి లెహ్ వెళ్తూ భారత వైమానిక దళ విమానం కూలిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ వ్యాలీలో ఏఎన్-12 విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. విమానం రొహ్‌తంగ్ దాటగానే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఇదిలా ఉండగా హిమాచల్‌ప్రదేశ్ మంచుపర్వతాన్ని శుభ్రం చేస్తుండగా పర్వతారోహకుల బృందం విమాన శకలాన్ని గుర్తించింది. దానికి కొద్ది దూరంలోనే సైనికుడి మృతదేహం కనిపించింది.రాజీవ్ రావత్ సారధ్యంలోని బృందం ఈనెల 1 నుంచి 15 వరకూ ‘క్లీన్లీనెస్’ కార్యక్రమాన్ని చేపట్టింది. చంద్రభాగా మంచు పర్వతంపై ధాకా గ్లాసియర్ వద్ద సైనికుడి మృతదేహం లభించినట్టు ఓ వార్తసంస్థకు రావత్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. పర్వతాన్ని శుభ్రం చేస్తుంగా తొలుత విమా న శకలాలను గుర్తించినట్టు ఆయన వెల్లడించారు. తరువాత ధాకా గ్లాసియర్ వద్ద సైనికుడి మృతదే హాన్ని కనుగొన్నామని ఆయన తెలిపారు.‘మేం దేన్నీ ముట్టుకోలేదు. ఫొటోలు, వీడియోలు సైనిక అధికారులకు పంపిం చాం’అని ఆయన పేర్కొన్నారు. మృతదేహం వద్దే సైనికులు వాడే సంచి ఉందన్నారు. క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని వౌంటనీరింగ్ ఫౌండేషన్, ఓఎన్‌జీసీ సంయుక్తంగా చేపట్టాయి. పర్యాటకులు, పర్వతారోహకులు పడవేసే చెత్తాచెదారం తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు.