హైదరాబాద్

రంగారెడ్డి జిల్లాకు నీళ్లివ్వరా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రైతాంగానికి సాగునీటిని అందించి కోటి ఎకరాల పంట సాగుకోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రకటించుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు ప్రాజెక్టుల ద్వారా నీటి కేటాయింపులను ఎందుకు ప్రకటించడంలేదని మాజీ హోంశాఖ మంత్రి పి.సబితారెడ్డి ప్రశ్నించారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రాజెక్టుల కింద పంట సాగు,నీటి కేటాయింపులపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు నీటి కేటాయింపు, వ్యవసాయ సాగుపై ఎందుకు ప్రకటించడంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని సభల్లో ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ఈ జిల్లాకు ఎంత నీటిని కేటాయిస్తున్నారో ప్రకటించడం లేదని ఆమె అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునుండి రంగారెడ్డి జిల్లాకు సాగునీటిని తరలించే అంశాన్ని తొలగించే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ప్రకటించారని ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా ఆహ్వానించిన టెండర్లలో కనీసం ఒక ఎకరా పంట సాగుకు రంగారెడ్డి జిల్లా సంబంధించి ఒక టెండరుగానీ, ఒక రూపాయి నిధుల కేటాయింపు గానీ కనీసం గ్యాలన్ నీరు గానీ కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేసే సమయంలో జిల్లాను విభజించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం అసలు జిల్లాకే నీటి కేటాయింపు చేయకపోవడం బాధాకరమని అన్నారు. పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందిస్తామని చేసిన ప్రకటనఅమలుకు నోచుకోవడంలేదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడిగా డిండి ప్రాజెక్టునుండి రంగారెడ్డి జిల్లాకు నీరివ్వలేమంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారని, ఇలాంటి సమస్యలతో చేసిన ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో రంగారెడ్డి జిల్లాకు నీరు రాకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. 2007లో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నిధులు కేటాయించి పనులు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్‌రావు నిందలు వేస్తున్నారని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకున్న కాంట్రాక్టర్లతో పని చేయించుకోలేక ఇచ్చిన డబ్బులను వెనక్కి తెప్పించుకోలేని పరిస్థితుల్లో మంత్రి మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు.
మెదక్ జిల్లాలోని ప్రాజెక్టు పనుల్లో కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతోనే పని చేయించుకుంటున్న అధికార పక్షం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను రంగారెడ్డి జిల్లాలో ఎందుకు చేయించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు చెల్లించారని, ప్రస్తుతం అదే కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని ఆమె అన్నారు. రంగారెడ్డి జిల్లాకు ఏ ప్రాజెక్టు ద్వారా సాగునీరు కేటాయించి పనులు చేపడతారో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్‌నుండి నల్లగొండ జిల్లాకు రెండున్నర లక్షల ఎకరాల పంట సాగుకోసం నీటి కేటాయింపులు చేసారని అదే తరహాలో పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఎంత నీటిని కేటాయిస్తున్నారో ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం పదవులను కాపాడుకోవడానికి రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను అడ్డంపెడుతూ రంగారెడ్డి జిల్లా రైతాంగానికి సాగునీటిని కేటాయించకుండా ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకోలేని స్థితిలో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పార్లమెంటు, శాసన సభ్యులు ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టుల్లో రంగారెడ్డి జిల్లాకోసం నీటి కేటాయింపులను చేయకుంటే టిఆర్‌ఎస్‌కు ప్రజలే గుణపాఠం చెప్తారని నెత్తిన పెట్టుకున్న ప్రజలే తరిమికొట్టే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తూ వెంటనే దీనిపై సానుకూల చర్యలు చేపట్టి ప్రభుత్వం ప్రకటించాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు.