జాతీయ వార్తలు

సర్పంచ్‌లు లేకుండా పల్లెశోభా?: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: సర్పంచ్‌లు లేకుండా గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఈనెల 15 తేదీ నుంచి పల్లెశోభ కార్యక్రమాన్ని చేపట్టిందని, సర్పంచ్‌లు లేకుండా అది సాధ్యమా?అని అన్నారు. హైకోర్టు కేసును అడ్డం పెట్టుకుని సర్పంచ్‌లను తొలగించటం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పునిచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకూ ఆపద్ధర్మ సర్పంచ్‌లుగా కొనసాగించి ఉండాల్సిందని దత్తాత్రేయ అన్నారు. పల్లెశోభను అమలు చేయాల్సిన సర్పంచ్‌లు లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పల్లెలపై అంత శ్రద్ధ ఉంటే నిధుల విడుదలను ఎందుకు నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం 29 నుంచి 19 రంగాలకు సంబంధించిన నిధులను విడుదల చేయటం లేదని దత్తాత్రేయ చెప్పారు. కాగా ఎస్‌సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం తీసుకున్న ప్రధాని మోదీకి దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎంతోకృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, నెహ్రూ కుటుంబ సభ్యులు దళిత విరోధులని తీవ్ర ఆరోపణ చేశారు.