జాతీయ వార్తలు

రాజీవ్ సేవలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖ నేతలు సోమవారం నాడిక్కడ ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ 74వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆయన సేవలను నేతలు కొనియాడారు. ఇక్కడి వీర్‌భూమిని సందర్శించిన మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతోబాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ రాజీవ్‌కు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. దేశానికి రాజీవ్
చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో ప్రస్తుతించారు. 1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు ప్రధాన మంత్రి పదవిలో ఉన్నారని, వారి తండ్రి నెహ్రూతో తనకున్న అనుబంధం సమున్నతమైనదని మోదీ గుర్తుచేసుకున్నారు. విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రాజీవ్ అందరినీ ప్రేమించే స్వభావం కలవారని ఆయన అకాల మరణం తనను ఎంతగానో కుంగదీసిందని తెలిపారు. రాజీవ్ జీవించివుండగా ఆయనతో కలిసి అనేక పుట్టిన రోజులు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన లేకున్నా జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మిగిలివుంటాయన్నారు. కాగా భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వీర్ భూమికి వచ్చిన ప్రియాంక వాద్రాతోబాటు మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ మాజీ ప్రధాని రాజీవ్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఆధునికత వైపు నడిపిన మహోన్నత మార్గదర్శి రాజీవ్ గాంధీ అని కీర్తించారు. ఆయన యువజనులందరికీ స్ఫూర్తిప్రదాతగా అభివర్ణించారు. శాంతి, సౌభ్రాతృత్వాలకు, త్యాగశీలతకు ఆయనే ఆదర్శమన్నారు. కాగా రాజీవ్ గాంధీ భవిష్యత్ దృక్పథం కలిగిన మహానేత అని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలెట్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాజీవ్ జయంతిని సద్భావనా దివస్‌గా జరుపుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన అమేథీలో రాజీవ్‌గాంధీ జయంత్య్రుత్సవాలు ఘనంగా జరిగాయి.

చిత్రం..రాజీవ్ జయంతి సందర్భంగా పార్లమెంటు హాలులోని ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్.కె.అద్వానీ, సోనియా, రాహుల్ తదితరులు