జాతీయ వార్తలు

ఎన్నికలంటే వెన్నుచూపుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: తెలంగాణలోని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, జనసమితి, వామపక్ష పార్టీలు ఎన్నికలంటేనే భయపడిపోతున్నాయని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలనుంచి వస్తున్న మద్దతును చూసి మొదటి జాబితాను కూడా విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు పొత్తులకోసం ఎగబడుతోందని వ్యాఖ్యానించారు. ఓటర్ల గల్లంతు విషయంలో ఎవరి నోటికొచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పరిమితికి మించి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాని బీజేపీ తమ పార్టీకి ఏమాత్రం పోటీ కాదని అన్నారు. బీజేపీ తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేసిందని, విభజన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.