జాతీయ వార్తలు

మళ్లీ మోదీనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏబీపీ న్యూస్, రిపబ్లికన్ టీవీ సీ-ఓటర్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కుతుందని, నరేంద్రమోదీ మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపడుతారని ఏబీపీ న్యూస్ సీ-ఓటర్ నిర్వహించిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 276 సీట్లు వస్తాయి. ఈ కూటమికి 38 శాతం ఓట్లు లభిస్తాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమికి 112 సీట్లు లభిస్తాయని, 25 శాతం ఓట్లు దక్కుతాయని సర్వే పేర్కొంది. ఈ రెండు కూటముల్లో లేని ఇతర పార్టీలు 37 శాతం ఓట్లతో 155 సీట్లను గెలుచుకుంటాయని ఏబీపీ న్యూస్ సీ-ఓటర్ జోస్యం చెప్పింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందుగా తమ సంస్థ ఈ సర్వేచేపట్టినట్లు తెలిపారు. ఒడిశా, హర్యానాలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం వీస్తుంది. ఢిల్లీలో అన్ని సీట్లను బీజేపీ కైవశం చేసుకుంటుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధిక సీట్లను గెలుచుకుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో యూపీఏ ఆధ్వర్యంలోని మహాకూటమి సగానికి సగం సీట్లు గెలుచుకుంటుందని అంచనా. కాగా కూటమిలో ఎస్పీ, బీఎస్పీ లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి గడ్డుపరిస్థితే. బిహార్‌లో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమి మధ్య పోరు నువ్వా, నేనా అనే విధంగా ఉంటుంది. ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహారాష్టల్రో బీజేపీకే ఎక్కువ సీట్లు దక్కనున్నాయి. కూటమిలో నుంచి శివసేన తప్పుకున్నా, బీజేపీకి ఎక్కువ సీట్లు లభిస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీ-శివసేన కూటమి చీలిపోతే కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఏర్పడితే పోటీ రసవత్తరంగా ఉంటుంది.
ఆంధ్రాలో వైకాపా హవా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు 21 సీట్లు, టీడీపీకి 4 సీట్లు లభిస్తాయని సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపాకే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ఆంధ్రాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయి. ఈ పార్టీలు ఒక్క సీటును కూడా గెల్చుకోలేవు. వైకాపాకు 41.9 శాతం ఓట్లు, టీడీపీకి 31.4 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేశారు. బీజేపీకి 12.5 శాతం, కాంగ్రెస్‌కు 7.2 శాతం ఓట్లు వచ్చినా సీట్లుమాత్రం రావు. సీపీఐ, సీపీఎం, జనసేనకు 8 నుంచి 9 శాతం ఓట్లు వచ్చినా సీట్లు రావని ఈ సంస్థ సర్వేలో తేలింది.

టీఆర్‌ఎస్‌కు 9 సీట్లు:
---------------------------
తెలంగాణలో 2014 ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్‌కు రెండు సీట్లు తగ్గుతాయని సీ ఓటర్ సర్వేలో తేలింది. మొత్తం 17 లోక్‌సభ సీట్లలో టీఆర్‌ఎస్‌కు 9 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు, బీజేపీ, ఎంఐఎంకు చెరొక సీటు లభిస్తాయని అంచనా. గత ఎన్నికల్లో టీడీపీ మల్కాజగిరి సీటు నుంచి గెలిచింది. ఈసారి ఈ స్థానాన్ని టీడీపీ కోల్పోతుందని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఈ సారి మహాకూటమి వల్ల కాంగ్రెస్‌కు ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే జోస్యం చెప్పింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 34.9 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.3 శాతం ఓట్లు, ఎఐఎంఐఎంకు 3.6 శాతం ఓట్లు, బీజేపీకి 19.5 శాతం ఓట్లు, ఇతరులకు 11.7శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వేలో పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మారే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.