క్రీడాభూమి

హిట్‌మ్యాన్ రెండు రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 6: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం వెస్టిండీస్‌తో లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన రెండో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు సరికొత్త రికార్డులను లిఖించాడు. టీ-20ల్లో అత్యధిక శతకాలు (4) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించడం ఒకటికాగా, టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ-20ల్లో చేసిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించడం రెండోది. భారత్-వెస్టిండీస్ మధ్య మంగళవారం రెండో మ్యాచ్‌లో రోహిత్ చెలరేగి ఆడి 61 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీ-20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా ఘనత వహించాడు. భారత్-వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ జరగడానికి ముందు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (62 మ్యాచ్‌లలో సాధించిన 2102 పరుగులు) కంటే 11 పరుగులు వెనుకబడి ఉన్నాడు. అయితే, మ్యాచ్ ఐదో ఓవర్‌లో విండీస్ పేసర్ ఒషానే థామస్ వేసిన రెండో బంతిని మిడ్ ఆఫ్ మీదుగా సిక్సర్‌గా మలిచినన రోహిత్ టీ-20ల్లో మొత్తం 2202 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గుప్తిల్ (2271) రికార్డుకు అతి సమీపంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ 86 టీ-20లలో 48.88 సగటున ఈ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా టీ-20లలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. బ్రాత్‌వైట్ 7వ ఓవర్‌లో వేసిన బంతికి సింగిల్ రన్ తీయడం ద్వారా 1000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు.