హైదరాబాద్

గులాబీ దళంలో నాంపల్లి లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు విషయంలో అధిష్టానం కాస్త అయోమయానికి గురైంది. గతంలో ఇన్‌ఫౌండ్రీ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. ఆనంద్‌గౌడ్ పేరును రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ వాస్తవానికి ఆ సీటును నాంపల్లి దేవీబాగ్ ఆలయం సమీపంలో నివసించే సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్‌కు కేటాయించాల్సి ఉండగా, రెండు పేర్లు ఒకేలా ఉండటంతో అధిష్టానం పొరపాటున ఎం. ఆనంద్‌గౌడ్ పేరును ఖరారు చేసింది. కానీ రెండురోజుల క్రితం ఎం.ఆనంద్‌గౌడ్‌ను రాష్ట్ర తెలంగాణ భవన్‌కు పిలిపించిన ఆ పార్టీ నేతలు ఓ గదిలో కూర్చోబెట్టి, పార్టీ సీహెచ్ ఆనంద్‌గౌడ్ పేరు స్థానంలో ఎం. ఆనంద్‌గౌడ్ పేరును పొరపాటుగా ప్రకటించారని వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సీహెచ్ ఆనంద్‌గౌడ్‌ను కూడా సోమవారం తెలంగాణ భవన్‌కు పిలిపించిన పార్టీ నేతలు ఆనంద్‌గౌడ్ అంటే మీరు కాదని, మీ స్థానంలో సీహెచ్ ఆనంద్‌గౌడ్‌కు సీటును ఖరారు చేస్తున్నట్లు సోమవారం నిర్ణయించారు.
భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేసేందుకు, ఆ తర్వాత ముమ్మర ప్రచారాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఈ అవకాశం దక్కేందుకు ఎంతో కృషి చేసిన అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఆనంద్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో మజ్లీస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ముస్లిం మైనార్టీలే బరిలో ఉన్నందున, తాను గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఈ దిశగా తాను వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆనంద్‌గౌడ్ వెల్లడించారు.
నాడు పార్టీ..నేడు పేరు
ఒకరికి ఖరారు చేయాల్సిన స్థానాన్ని మరొకరికి ఖరారు చేసిన ఘటన గత 2009 ఎన్నికల్లో కూడా జరిగింది. అప్పట్లో కాంగ్రెస్‌ని ఓడించేందుకు టీఆర్‌ఎస్, టీడీపీలతో ఏర్పడిన మహాకూటమిలో భాగంగా తొలుత గోషామహల్ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దేవరిమల్లప్ప పేరు ఖరారైంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటులో భాగంగా గోషామహల్ సీటును టీడీపీ తీసుకుని, అభ్యర్థిగా జీ.ఎస్.బుగ్గారావును బరిలో నిలిపింది. ఇపుడు అభ్యర్థుల పేర్ల విషయంలో కాస్త అయోమయానికి గురై, తొలుత నాంపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తొలుత ఎం. ఆనంద్‌గౌడ్ పేరును ప్రకటించిన అధిష్టానం సోమవారం ఆయన స్థానంలో సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది.