క్రీడాభూమి
వరల్డ్ బాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లోకి లక్ష్యసేన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 November 2018
మార్ఖమ్ (కెనడా), నవంబర్ 17: భారత యువ షట్లర్, ప్రపంచ మూడో ర్యాంకర్ లక్ష్యసేన్ ఇక్కడ జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌లో చోటుదక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో పోటీపడిన లక్ష్యసేన్ మలేషియా షట్లర్ ఆదిల్ సోలెహ్ అలీ సడికిన్ను 21-8, 21-18 తేడాతో ఓడించాడు. 31 నిమిషాలపాటు సాగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో తొలినుంచి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన లక్ష్యసేన్ సెమీఫైనల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన టాప్‌సీడ్ కున్లావుట్ విటిడ్శార్న్తో తలపడతాడు.