హైదరాబాద్

సనత్‌నగర్‌లో రెండోసారి గెలిచిన తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా విజయఢంకాను మోగించారు తాజా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్‌నగర్ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తలసాని ప్రత్యర్థి మహాకూటమి అభ్యర్థి అయిన టీడీపీ నాయకుడు కూన వెంకటేశ్ గౌడ్‌పై 30వేల 217 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సత్తాను చాటారు. 16 రౌండ్ల పాటు కొనసాగిన కౌంటింగ్‌లో తలసానికి 66వేల 464 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కూన వెంటకటేశ్‌కు 38వేల 383 ఓట్లు లభించాయి. దీంతో శ్రీనివాస్ యాదవ్ 30 వేల మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బవర్‌లాల్ వర్మ 14వేల 240 ఓట్లు దక్కించుకుని తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా రెండోసారి గెలిచిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అండతో గెలుపొందానని, దీనికి సహకరించిన స్థానిక కార్పొరేటర్‌లు, నాయకులు, కార్యకర్తల అండదండలతో విజయం సాధించడం సంతోషంగా వుందన్నారు. తాను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన విజయానికి బాట వేశాయన్నారు.