క్రీడాభూమి

కోహ్లీ సామ్రాజ్యంలో విలువైన సంపద పుజారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 6: ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టుల్లో పరుగుల వరద పారించిన చటేశ్వర పుజారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సామ్రాజ్యంలో అత్యంత విలువైన సంపద వంటివాడని ఆసిస్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. ఆసిస్‌తో జరుగుతున్న టెస్టుల్లో ఆడిన పుజారా ఇప్పటికే మూడు సెంచరీలు నమోదు చేశాడని అన్నాడు. టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులతో ఆధిపత్యం చెలాయించడమే కాకుండా భారత్ విజయపథాన నిలిచేందుకు పుజారా కీలక భూమిక పోషించాడని అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో ప్రత్యర్థి బౌలర్ల ధాటిగా ఎదుర్కోవడంతోపాటు తమ జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో మరింత స్ఫూర్తిని నింపాడని చాపెల్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు రాసిన ఒక కాలమ్‌లో పేర్కొన్నాడు. 3్భరత క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ కింగ్ అయితే, ఆతని సామ్రాజ్యంలో వచ్చిన అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో చటేశ్వర్ పుజారా తానేంటో రుజువుచేసుకున్నాడు2 అని చాపెల్ ప్రశంసించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై మూడు సెంచరీలు సాధించడంతో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 1977-78లో ఘనతను పుజారా సాధించాడని అన్నాడు. పుజారా ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో 1867 నిమిషాల్లో 1258 బంతులను ఎదుర్కొని అత్యధికంగా 521 పరుగులు సాధించాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా మైదానంలో ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీమిండియా తొలిసారిగా టెస్టు సిరీస్‌ను గెలవడం గొప్పవిషయమని అభివర్ణించాడు.