జాతీయ వార్తలు

ఉబర్.. ఓలాతో ఉద్యోగాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాము దేశంలో లక్షలాది ఉద్యోగాలను కల్పించామని కేంద్రం ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వ దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమని ఆయన విమర్శించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఓలా/ఉబర్ లక్షలాది ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొందని, దీనిపై ఒక ఉబర్ డ్రైవర్ స్పందిస్తూ ‘ప్రభుత్వమేమీ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు... లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత మేము ఈ స్థానంలో ఉన్నాం’ అని పేర్కొనడాన్ని రాహుల్ ఫేస్‌బుక్‌లో ప్రస్తావించారు. మోదీ హయాంలో దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న
నిరుద్యోగం, తన వాగ్దానాల అమలులో విఫలం కావడంపై తరచూ విమర్శలు చేసే రాహుల్ మరోసారి దేశంలో ఎక్కువవుతున్న నిరుద్యోగితపై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలోకి రాకముందు మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారని ఆయన ప్రశ్నించారు. గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత పెరిగిపోయిందని ఒక ఇంగ్లీష్ డైలీలో వచ్చిన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అయితే ప్రభుత్వం మాత్రం దేశంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా 2017-18 సంవత్సరంలో 6.1 శాతం ఉందని లేబర్ ఫోర్సు ఇచ్చిన నివేదికను తాము ఇంకా ఖరారు చేయలేదని చెబుతోందని రాహుల్ విమర్శించారు.