క్రీడాభూమి

ఇది ‘మూడు రోజుల పిచ్’ కాదేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఇప్పటివరకు భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లోను స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిన దక్షిణాఫ్రికా జట్టు మంగళవారం ఇక్కడి ఫిరోజ్‌షా కోట్లా పిచ్‌ని చూసిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పిచ్ మూడు రోజులకన్నా ఎక్కువ రోజులు కొనుసాగేదిగా కనపిస్తోందని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అడ్రియన్ బిరెల్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోవడంతో పాటుగా జరిగిన రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. కాగా, గురువారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న నాలుగవ, చివరి టెస్టులో పోయిన పరువును కాస్తయినా నిలబెట్టుకోవాలని దక్షిణాఫ్రికా ప్రయత్నిస్తోంది. తాము భారత్‌లో ఆడుతున్నాం గనుక ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయనే విషయం తమకు బాగా తెలుసునని, అయితే ఇక్కడి పిచ్‌ని చూసిన తర్వాత మూడు రోజులకన్నా ఎక్కువే మ్యాచ్ కొనసాగే పిచ్‌లాగా ఇది కనిపిస్తోందని బిరెల్ అన్నాడు. అంతేకాదు తాము ఇప్పటివరకు మంచి క్రికెట్ ఆడలేదని, ఈ మ్యాచ్‌లో చక్కటి ప్రతిభను కనబరచాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని కూడా ఆయన చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో అన్ని విభాగాల్లోను టీమిండియా పై చేయి కనబరిచిందని కూడా ఆయన అంగీకరించాడు. ‘్భరత్‌లోనే కాదు మిగతా చోట్ల కూడా చాలా టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. టి-20 క్రికెట్ రాకతో ఇప్పుడు డ్రా అయ్యే మ్యాచ్‌లు తగ్గిపోయాయి. రన్స్ కూడా చాలా వేగంగా వస్తున్నాయి. అయితే ఇది మంచో కాదో నేను చెప్పలేను’ అని బిరెల్ అన్నాడు. ప్రతి దేశం కూడా టెస్టు సిరీస్ గెలవాలనే అనుకుంటుందని, భారత్‌కూడా అందుకు మినహాయింపేమీ కాదని ఆయన అంటూ, చివిర టెస్టులోనైనా భారత్‌పై పై చేయి సాధించాలని అనుకుంటున్నామని అన్నాడు. రెండు జట్ల మధ్య తేడా ఏమిటని అడగ్గా, భారత జట్టులో మాకన్నా మెరుగైన సిన్నర్లు ఉన్నారని ఆయన చెప్పాడు. అయితే రెండు జట్లు కూడా పరుగులకోసం కష్టపడ్డాయని ఆయన అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను తమ బ్యాట్స్‌మెన్ సరిగా ఆడలేక పోయారని కూడా ఆయన అంగీకరించాడు.