క్రీడాభూమి

అది మా చేతుల్లో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 3: ఉగ్రవాద సంబంధాలు కలిగిన దేశాలను ప్రపంచ కప్ పోటీల నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్ర దాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు హతమైన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సుదీర్ఘమైన లేఖను రాసింది. ఉగ్రవాద సంబంధాలు కలిగిన ఏ దేశాన్నయినా ప్రపంచ కప్‌లో ఆడకుండా నిషేధించాలని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఐసీసీని అభ్యర్థించింది. ఐసీసీలో సభ్యత్వం కలిగిన ఏ దేశాన్నయినా ఒక ప్రధాన కారణం నెపంతో ప్రపంచ కప్‌లో ఆడకుండా నిషేధించడం అనే ప్రక్రియ తమ పరిధిలోకి రాదని, ప్రభుత్వమే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ లేఖను పరిశీలించిన ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ మనోహర్ నేతృత్వంలో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాక్ ఆడకుండా నిషేధించాలన్న ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఇది తమ పరిధిలోకి రాదని ఐసీసీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆటగాళ్లు ఆడుతున్నారని, వారెవరూ పాక్‌ను నిషేధించాలని కోరడం లేదని అంటూ వరల్డ్ కప్‌లో భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. వాస్తవానికి వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో నిర్వహించే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ జూన్ 16న పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. అయితే, పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నందున, జవాన్లపై దాడికి పాక్‌కు ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ నుంచి పాక్‌ను బహిష్కరించాలని బీసీసీఐ కోరుతోంది. అయితే, పాక్‌ను బహిష్కరించే అంశం తమ చేతుల్లో లేదని ఐసీసీ స్పష్టం చేయడంతో ఇపుడు ప్రభుత్వ నిర్ణయం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది.