తెలంగాణ

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, మే 5: మండే ఎండల్లో పోలింగ్ విధుల నిర్వహణకు వచ్చిన సిబ్బంది కొంత ఇబ్బందికి గురయ్యారు. ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఉపాధ్యాయుల నెత్తిన ప్రతి ఒక్కరు క్యాప్ ధరించడం కనిపించింది. మహిళలు స్కార్ఫ్ లేదా చీర కొంగు తలపై కప్పుకోవడం కనిపించింది. అదే సమయంలో చల్లని నీటి క్యాన్‌లను తీసుకువచ్చి పంపిణీ కేంద్రం వద్ద ఉంచగా ఉపాధ్యాయులు, పోలింగ్ సిబ్బంది గుమిగూడి వెంట తెచ్చుకున్న బాటిళ్లలో నీళ్లు నింపుకుని తమ దాహం తీర్చుకున్నారు. అదే బాటిళ్లలో నీటిని తమ వెంట తీసుకెళ్లారు. మండే ఎండల్లో పోలింగ్ విధుల నిర్వహణ కత్తిమీద సాములా మారిందని సిబ్బంది పేర్కొన్నారు.