తెలంగాణ

ఇక కాంగ్రెస్ భూస్థాపితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతనకల్, మే 5: రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణను విస్మరించి సమైక్య పాలకులకు ఊడిగం చేసిన కాంగ్రెస్.. ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్రంలో భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 60 ఏళ్లలో దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ వల్ల ఎలాంటి లాభం కలగలేదని, వారి హయాంలో నాయకులు అభివృద్ధి చెందారే తప్ప ప్రజలకు చేసిన మేలేమి లేదని విమర్శించారు. గత పాలకులు సక్రమంగా పనిచేస్తే నేటికీ రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు కూడా అందకుండా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తుంగతుర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ రెండో దశను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహించి పెండింగ్ పనులను పూర్తిచేయించి పలుమార్లు నీటిని విడుదల చేయించామన్నారు. మూడేళ్లలోనే సీఎం కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో రెండు పంటలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. తుంగతుర్తి ప్రాంతాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి బదులు ఫ్యాక్షనిజాన్ని పెంచి గ్రామాలను శ్మశానాలుగా మార్చారన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో అవే పల్లెలో ఇప్పుడు శాంతియుత వాతావరణంలో ప్రజ్వరిల్లుతున్నాయని అన్నారు. అలాంటి పల్లెల్లో ప్రాదేశిక ఎన్నికల పేరుతో మళ్లీ కుంపటి రాజేసేందుకు అవే పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజల నమ్మకాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ శ్రేణులపైనే ఉందని సూచించారు. నూతనకల్ మండలంలోని 10 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ నూతనకల్ మండలంలో చైతన్యవంతమైన ప్రజ లు అభివృద్ధిని కోరి ఏకతాటిపై ఉన్నారన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ నర్సింగ్‌నాయక్, నాయకులు తాడూరి లింగయ్య, కనకటి వెంకన్న, కృష్ణప్రసాద్, బుచ్చయ్య పాల్గొన్నారు.
చిత్రం... కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి