తెలంగాణ

కొత్త జిల్లాల్లో ఆధునిక హంగులతో కోర్టు భవనాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 6: కొత్త జిల్లాల్లో ఆధునిక హంగులతో కోర్టు నూతన భవన నిర్మాణాలు చేపట్టేందుకు అనువైన స్థలాల గుర్తించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించారు. భవన పరిస్థితిపై ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల అంశాలపై జిల్లా కోర్టు భవన సమావేశమందిరంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల్లో సకల సదుపాయాలతో ఆధునిక రీతిలో నూతన కోర్టు భవనాలు నిర్మించాల్సి ఉంటుందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు సైతం చాలా తక్కువ సమయంలో నిర్మించారని, జ్యుడీషియల్ రంగానికి సంబంధించిన భవనాలను సైతం అదే తరహాలో నిర్మించాలన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండటం ద్వారా పౌరులకు భరోసా కల్పించవచ్చన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 3,744 కేసులు పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నెలకో రెండుసార్లు సమావేశాలు నిర్వహించుకొని నూతన ప్రణాళికాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా చట్ట ఉల్లంఘన చేస్తున్నవారిపై కఠినవైఖరి అవలంబించాలని, ఆ కేసులను త్వరగా పరిష్కరించి చట్టప్రకారం శిక్షలు పడేలా చేస్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కరీంనగర్ కోర్టు భవన నిర్మాణం బాగున్నప్పటికీ ఆధునికంగా లేదని, ఇతర రాష్ట్రాల్లో కోర్టు భవనాలు చాలా ఆధునికంగా ఉన్నాయని, సీసీ కెమెరాల నిఘా, కంప్యూటర్ కంట్రోల్‌తో కూడిన భవనాలను నిర్మించారని, వాటిని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా అదే తరహాలో నిర్మించాలని, లేకపోతే తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉంటుందన్నారు. కోర్టు భవనాలు నిర్మించే సమయంలో జడ్జిలు, ముఖ్యన్యాయమూర్తుల భవన నిర్మాణాలకు సైతం భూసేకరణ చేయాలన్నారు. కర్నాటక రాష్ట్రంలో నిర్మించిన కంప్యూటర్ కంట్రోల్డ్ కోర్టు భవనాలను అధికారులు పరిశీలించాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నాలుగు జిల్లాల కోర్టు భవన నిర్మాణాల్లో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన తరహాలో భవన నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేమనే సంకల్పంతో పనిచేస్తే సక్సెస్ సాధించడం సమస్యేమీ కాదన్నారు. నూతంగా నిర్మించిన ఏ కోర్టు భవనాలకైనా రోడ్ కనెక్టివిటీ తప్పనిసరిగా ఉండాలని, నూతన కోర్టు భవనంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలని, 2007లో హైకోర్టులోని ఒక భవనం అగ్నిప్రమాదానికి గురికావడం వల్ల అనేక విలువైన రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయని, అలాంటి ప్రమాదాలకు రికార్డులు బుగ్గిపాలు కాకుండా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ భవన నిర్మాణాలు సాగాలని సూచించారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు శ్రీ దేవసేన, శరత్, సిరిసిల్ల జేసీ షేక్ యాస్మీన్ భాషా, కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం... జిల్లా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్