తెలంగాణ

13న టెన్త్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: పదో తరగతి ఫలితాలను ఈ నెల 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డి విడుదల చేయనున్నారని, విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్, పరీక్షల బోర్డు సంచాలకుడు సుధాకర్‌లు తెలిపారు. ఫలితాలను పరీక్షల బోర్డు వెబ్ పోర్టల్ సహా ఇతర పోర్టల్స్‌లో కూడా ఉంచుతామని వారు పేర్కొన్నారు. వీటితో పాటు మిగిలిన ప్రైవేటు పోర్టల్స్‌లో కూడా ఫలితాలను ఉంచుతామని వారు చెప్పారు.
ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం సాంకేతిక లోపాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు కావడంతో టెన్త్ ఫలితాల అనంతరం కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి పాఠశాల విద్యాశాఖ అదికారులకు మార్గదర్శనం చేశారు. ఇందుకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చి ఏదైనా ఒక సబ్జెక్టులో మార్కులు తగ్గినట్టయితే అలాంటి వారి పేపర్లను మరోసారి పరిశీలించాలని, అదే విధంగా సబ్జెక్టుల్లో ఒక్క మార్కు సైతం రాకుండా సున్నాలు వచ్చినట్టయితే వాటిని కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. తద్వారా విద్యార్థుల ఫలితాల్లో ఏమైనా స్వల్ప పొరపాట్లు ఉంటే సవరించి వాటిని ప్రకటించాలని పేర్కొనడంతో పదో తరగతి ఫలితాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉండబోవని అధికారులు ధీమాగా చెబుతున్నారు. తద్వారా విద్యార్థుల నుండి ఎలాంటి నిరసనలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.