తెలంగాణ

అవన్నీ ప్రభుత్వ హత్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: విద్యార్థుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీఎం కేసీఆర్‌కు ఇతర రాష్ట్రాల పర్యటనపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆత్మహత్యలపై లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం సరిదిద్దాలని కోరుతూ ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎఐవైఎఫ్ దీక్షలు చేస్తున్న నేతలను శుక్రవారం నాడు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల జరిగిన ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలుగానే చూస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంటర్ బోర్డు నిందితులను, గ్లోబరీనా సంస్థను కాపాడటం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కుట్రలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం ఏమిటని అన్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబీకులను అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధీ పరామర్శించలేదని అన్నారు. సీఎం కేసీఆర్ కావాలనే విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నారని, లోపాలు జరిగాయని నిర్ధారించి ఇన్ని రోజులు అవుతున్నా, ఏ ఒక్కరిపైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. విద్యామంత్రి జగదీష్‌రెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలివి తక్కువతనంతో మాట్లాడటం భావ్యం కాదని వారు పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థకూ, రాష్ట్ర ప్రభుత్వానికీ చీకటి ఒప్పందం జరిగినందునే ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత వెరిఫికేషన్, ఉచిత రీ కౌంటింగ్ పేరుతో చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, రీ వాల్యూయేషన్ చేయిస్తే అసలు రంగు బయటపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, టీజేసీ నేత ప్రొఫెసర్ విశే్వశ్వరరావు, డాక్టర్ డి సుధాకర్, టీడీపీ నేత సతీష్, కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి వినోద్‌రెడ్డి తదితరులు వచ్చి సంఘీభావం తెలిపారు.
జగదీష్‌రెడ్డిని తప్పించాలి: సీపీఐ
న్యూఢిల్లీ, మే 10: తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని తొలగించాలని సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మరణాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వమే అదుకోవాలన్నారు. గ్లోబరినా సంస్థపై చర్యలకు ఆదేశించాలని ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాసినట్టు చెప్పారు. తెలంగాణ ఇంటర్ బోర్టు అంతా కార్పొరెట్ సంస్థల తాయారు చేశారని ఆయన మండిపడ్డారు.