తెలంగాణ

టీవీ-9 రవిప్రకాశ్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: టీవీ 9 సంస్థలో సీఈఓగా ఉన్న రవిప్రకాశ్‌కు ఆ సంస్థ శుక్రవారం ఉద్వాసన పలికినట్టు ప్రకటించింది. నిధుల మళ్ళింపుతో పాటు సంస్థకు చెందిన ముఖ్యమైన పత్రాల ఫోర్జరీకి రవిప్రకాశ్ పాల్పడినట్టు ఆయనపై టీవీ-9 కొత్త యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఈఓ పదవి నుంచి తొలగించినట్టు ఈ సంస్థను కొనుగోలు చేసిన ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించింది. రవిప్రకాశ్‌ను సీఈవో పదవి నుంచి తొలగించాలని మే 8న జరిగిన బోర్డు సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్టు నలుగురు డైరెక్టర్ల మీడియాకు వివరించారు. రవిప్రకాశ్ స్థానంలో కొత్త సీఈఓగా మహేందర్ మిశ్రాను నియమించినట్టు బోర్డు డైరెక్టర్లు వెల్లడించారు. కొత్త సీఈఓగా నియామకమైన మహేందర్ మిశ్రా కన్నడ టీవీ 9కు ఎడిటర్, సీఈఓగా పని చేస్తున్నారు. అలాగే చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌గా గొట్టిపాటి సింగారావును నియమించినట్టు తెలిపారు.
ఇలా ఉండగా తాజాగా టీవీ-9లో యాజమాన్యంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కొత్త యాజమాన్యం (అలంద ఎబీసీఎల్ బోర్డు డైరెక్టర్ల) అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవిప్రకాశ్‌ను తొలగిస్తూ సీఈఓగా తొలగిస్తూ ఏక వ్యాఖ్య తీర్మానాన్ని ఆమోదించింది. రవిప్రకాశ్ ఉద్వాసనతో పాటు కొత్త యాజమాన్యం తీసుకోనున్న నిర్ణయాలను బోర్డు డైరెక్టర్ సాంబశివరావు మీడియాకు వివరించారు. ఇక నుంచి టీవీ 9 వ్యవహారాలను అలంద మీడియా పర్యవేక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి సంస్థ బాధ్యతలన్నీ కొత్త యాజమాన్యం పర్యవేక్షిస్తారని, టీవీ 9తో రవిప్రకాశ్‌కు ఏలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. టీవీ 9 షేర్లు దాదాపు 90.5 శాతం అలంద మీడియా కొనుగోలు చేసిందన్నారు. దీంతో పాటు టీవీ 9లో సమూల మార్పులకు కొత్త యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీవీ 9 ఆఫీసుకు కొత్త సెక్యూరిటీ సిబ్బందని నియమించింది. ఇక నుంచి టీవీ 9 కు చెందిన అన్ని ఛానళ్లను అలంద మీడియా పరిధిలో పని చేస్తాయన్నారు. గత ఎనిమిది నెలల కితం అలంద మీడియా ఏర్పాటు చేసిన డైరెక్టర్లను పని చేయకుండా రవిప్రకాశ్ అడ్డుకున్నారని బోర్డు ఆరోపించింది. తన వ్యవహారశైలిని మార్చుకోవాలని బోర్డు సూచించినా ఆయనలో మార్పు రాకపోవడంతో సీఈఓ పదవి నుంచి తొలగించక తప్పలేదని బోర్డు స్పష్టం చేసింది. సంస్థకు చెందాల్సి నిధులను పక్కదోవ పట్టించడంతో పాటు సంస్థకు చెందిన పత్రాలను ఫోర్జరీ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు వెల్లడించారు. కాగా టీవీ 9 అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్టు చేయడానికి రంగ సిద్ధం చేశారు. సైబరాబాద్ పోలీసులు ఎదుట శుక్రవారం హాజరు కావాల్సిన రవిప్రకాశ్‌తో పాటు నటుడు శివాజికి నోటీసులు జారీ చేసినా వారు హాజరు కాలేదు. దీంతో రెండోసారి నోటీసులు జారీ చేశారు. కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఫైనాన్సియల్ మేనేజర్ మూర్తిని పోలీసులు విచారించారు. టీవీ 9 ఆఫీసులో స్వాధీనం చేసుకున్న 12 హార్డు డిస్కుల్లోని సమాచారాన్ని విశే్లషించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.