క్రీడాభూమి

మాడ్రిడ్ విజేత జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 13: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరిగిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో అతను గ్రీస్‌కు చెందిన స్ట్ఫోనోస్ సిట్సిపాస్‌ను 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్‌పై 7-6, 7-6 ఆధిక్యంతో విజయం సాధించి సంచలనం సృష్టించిన సిట్సిపాస్ ఫైనల్లో అదే స్థాయిలో ఆడలేకపోయాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎంతో అనుభవం ఉన్న జొకోవిచ్ ధాటికి నిలవలేకపోయాడు. మొదటి సెట్‌లో పేలవంగా ఆడిన అతను రెండో సెట్‌లో కొంత సేపు ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ, అతని పోరాటం ఫలించలేదు. జొకోవిచ్ కెరీర్‌లో 33వ ఏటీపీ మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకొని, రాఫెల్ నాదల్ రికార్డును సమం చేశాడు. మాస్టర్స్ 1,000 విభాగంలో నాదల్ కూడా 33 టైటిళ్లు సాధించాడు. రోజర్ ఫెదరర్ 28 టైటిళ్లతో రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో నిలిచిన అండ్రీ అగస్సీ ఖాతాలో 17 టైటిళ్లు ఉన్నాయి. కాగా, జొకోవిచ్‌కు మాడ్రిడ్ ఓపెన్‌లో ఇది మూడో టైటిల్. రాఫెల్ నాదల్ ఇక్కడ ఐదు టైటిళ్లు సాధించి, తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు.