తెలంగాణ

రాష్ట్రంలో 5 గిగావాట్ల బ్యాటరీ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో 5 గిగావాట్ల బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ యూనిట్ స్థాపనకు అనువుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు, అవుటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో 200 ఎకరాలు కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, గిగా స్కేల్ లిమిటెడ్-అయాన్ బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం తమ రాష్ట్రం స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన మేరకు విద్యుత్, నీటి సదుపాయం, మానవ వనరులను అందిస్తామన్నారు. ట్రాన్స్‌ఫార్మెటీవ్ మొబిలిటీ అండ్ స్మార్ట్ స్టోరేజిపై నీతి అయోగ్ సీఈఓ అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో ఇంటర్ మినిస్ట్రీయల్ స్టీరింగ్ కమిటీతో కూడిన నేషనల్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గిగా బ్యాటరీ యూనిట్ స్థాపనకు ఏ రాష్ట్రం అనువుగా ఉందనే విషయాన్ని ఆరా తీస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని ఆరా తీయగా, బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందన్నారు. అన్ని అర్హతలు కలిగి ఉన్నాయని అన్నారు. తమ రాష్ట్రానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాయన్నారు. అలాగే టీఎస్-ఐపాస్ ద్వారా అన్ని సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అనుమతులతో పాటు సబ్సిడీలు, ప్రోత్సహకాలు ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సీఎస్ వివరించారు. రాష్ట్రంలో వాణిజ్యానికి అనుకూలమైన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని తాము అమలు చేస్తున్నామన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దేశంలోనే పెద్దదైన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఉందని గుర్తు చేశారు. 5 గిగావాట్ల బ్యాటరీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం ఆసక్తి కనబర్చడం పట్ల నీతి అయోగ్ సీఈఓ అభినందించారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ప్లాంట్ల నిర్మాణం కోసం ఎంపిక చేయనున్నట్టు ఆయన వివరించారు. 2023 నాటికి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ఎలక్ట్రికల్ వాహనాలుగా కనవర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నీతి అయోగ్ సీఈఓ సూచించారు. కేంద్రం ప్రకటించే ప్రోత్సహకాలలో స్టేట్ డిస్కమ్‌లకు సాఫ్ట్ లోన్స్, రూఫ్ టాప్ ఇన్‌స్టాలేషన్స్, మెక్రో గ్రిడ్స్ సదుపాయాలను కల్పించనున్నట్టు ఆయన తెలిపారు.