తెలంగాణ

స్పీకర్.. కేసీఆర్ గులాంగా వ్యవహరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ఎమ్మెల్యేల కొనుగోలుతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమవాశంలో మాట్లాడుతూ కేసీఆర్ గులాంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. నిబంధనలు పాటించకుండా సీఎల్‌పీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారన్నారు. రాజ్యాంగ బద్ధమైన అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ పట్టించుకోకపోతే రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్ హయాంలో మీరు ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అంటూ టీఆర్‌ఎస్ ఎదురుదాడి చేయడంలో అర్థం లేదన్నారు. అప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని అప్పటి స్పీకర్ రద్దు చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఈ విషయం మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థ ముఖ్యమన్నారు. న్యాయం కోసం అన్ని న్యాయ స్థానాలకు వెళతామని, న్యాయం జరగని పక్షంలో ప్రజాకోర్టుకు వెళతామన్నారు.
ఓయూలో విద్యార్థుల ర్యాలీ
సీఎల్‌పీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శుక్రవారం ధర్నా, ర్యాలీ నిర్వహించాయి. తెలంగాణ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని విద్యార్థి సంఘం నేతలు చెనగాని దయాకర్, ఆర్‌ఎన్ శంకర్, డీ రంజిత్, గడ్డం శ్యామ్ అన్నారు. తన కబంధ హస్తాల్లో తెలంగాణ సమాజాన్ని బంధించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వారు దుమ్మెత్తిపోశారన్నారు. ప్లకార్డులు పట్టుకుని వారు ర్యాలీ నిర్వహించారు.