తెలంగాణ

‘విలీనం’ రాజ్యాంగబద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: మూడింట రెండు వంతుల మెజారిటీ సభ్యుల అంగీకారంతో రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. సీఎల్పీ చేసిన తీర్మానం ప్రకారమే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా తమను విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ మండిపడింది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మహబాబాబ్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు కానీ, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నప్పడు కానీ ప్రజాస్వామ్యం ఖూనీ జరిగినట్టు అనిపించలేదా? కనిపించలేదా? అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ నాయకులు, గతంలో తమ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేశారా? సమాధానం చెప్పాలని నిలదీశారు. టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి రేంవత్‌రెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇందిరా కాంగ్రెస్‌లో ఇండియా కాంగ్రెస్‌లో విలీనం చేసిన చరిత్ర వారిదని ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అమ్ముడు పోయారంటూ కాంగ్రెస్ నేతలు దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.