తెలంగాణ

ఈ సోయి అప్పుడేమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 8: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దీక్షలు ఒక నాటకమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతులు గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 10 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. వైయర్ హయాంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో వీలినం చేయడాన్ని ఎందుకు వ్యతిరేకించ లేదని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, భ్రష్టు పట్టించడంలో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా అని అన్నారు. ఇప్పటికి అనేకసార్లు అధికారంలో ఉన్నప్పడు ప్రజా స్వామ్యాన్ని, రాజకీయ వ్యవస్ధలను భ్రష్టు పట్టించి వారి ప్రభుత్వాలను కాపాడుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. 2008లో అణు ఒప్పందం విషయంలో ఓటింగ్ సమయంలో పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొనుగోలు చేయలేదని వారు ప్రశ్నించారు . రాజ్యాంగం పదో షెడ్యూల్‌లో 2/3 వంతు ఎమ్మెల్యేల మెజార్టీ ఉంటే విలీనం జరిగితే ఆమోదించవచ్చునని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈవీఎం ఫిక్సింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని గగ్గోలు పెట్టిన మీరు మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో బ్యాలెట్ తీర్పుపై ఏమంటారని వారు ప్రశ్నించారు. ప్రాదేశిక ఎన్నికల ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చినప్పటికీ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికను బలపర్చారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రణాళిక కారణంగానే రాష్ట్రంలో అన్ని జడ్పీ స్ధానాల్లో టీఆర్‌ఎస్ గులాబీ జెండాను ఎగరేసిందన్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు దిమ్మతిరిగే విధంగా ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా తాము అన్నట్టుగానే ఆరు జడ్పీ స్ధానాలు క్లీన్ స్వీప్ చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 70 ఎంపీపీ స్థానాలకు 58 ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకున్నామని, రెండు స్ధానాలు వాయిదా పడగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 ఎంపీపీ స్ధానాలు దక్కాయని, ఒక్క స్థానంలో స్వతంత్య్ర అభ్యర్ధి గెలిచారన్నారు. ఆరు జడ్పీటీసీ స్థ్ధానాల్లో అన్ని వర్గాలకు సమతుల్యం కల్పించామన్నారు. ములుగు జడ్పీ జనరల్ రిజర్వుడు అయినప్పటికీ బీసీకి అవకాశం కల్పించి కుసుమ జగదీశ్‌కు చైర్మన్ పీఠం అప్పగించామని అన్నారు.